విబిజి బిసినెస్ గ్రూప్ (ఓ పత్రికలో వచ్చిన వార్త దగుల్బాజీ)   తో మాకు సంబంధం లేదు - విబిజి ఫౌండేషన్ ఛైర్మెన్ మడుపడుగ రాము



హైదరాబాద్:  ఇటీవల ఓ పత్రికలో విబిజి బిజినెస్ గ్రూప్ పై దగుల్బాజీ గ్రూప్ అని వార్తలు వచ్చాయని,ఆ గ్రూప్ తో మాకు సంబంధం లేదని విభిజి ఫౌండేషన్ ఛైర్మెన్ మరిపడుగ రాము తెలిపారు. హైదరాబాద్ లో ఫౌండేషన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ మా ఫౌండేషన్ ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదని, మా ఫౌండేషన్ కేవలం సేవా కార్యక్రమాల చేస్తుందని తెలిపారు.  విభిజి బిసినెస్ గ్రూప్ (దగుల్బాజీ) అనే వార్తను చూసి చాలామంది మిత్రులు నన్ను వివరణ అడిగారని అందుకే ఈ ప్రెస్స్ మీట్ ఏర్పాటు చేశామని తెలిపారు.  VBG ఫౌండేషన్ వేరు.. Vasavi Business Group వేరు అయితే VBG పేరుతో వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రసాద్,  రాజు, శ్రీహరి లు VBG ఫౌండేషన్ నిర్వాహక కమిటీలో ముఖ్య సభ్యులు అని, VBG ఫౌండేషన్లోని 22 మంది కమిటీలో ఆ ముగ్గురు కూడా కీలక పాత్ర పోషిస్తున్నవారే నని, కానీ వారి వ్యాపార కార్యక్రమాలకు పాండేషన్ కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధమూ లేదని గ్రహించాలని తెలిపారు. ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నాం తప్ప ఎలాంటి వ్యాపారాలు చేయడం లేదని గమనించాలని, మేం మా సొంత డబ్బుతో పాటు దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,  మీలో ఎవరైనా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకుంటే Foundation కు మాత్రమే విరాళాలు అందజేయాలని కోరారు. పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్, బుక్స్ పంపిణీ చేస్తున్నామని వైశ్య జాతిని ఏకీకృతం చేయడానికి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,  మంచి పనులు చేస్తున్నామని Foundation పేరుతో ఎవరైనా వ్యాపార కార్యకలాపాల గురించి ఫండ్స్ అడిగినా, తీసుకున్నా ఫౌండేషన్ ఎలాంటి బాధ్యతా వహించదని తెలిపారు. ఫౌండేషన్ కేవలం నిరుపేదల కోసం సేవా కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తుందని, అందుకోసం మాత్రమే విరాళాలు అందజేసి ఒరిజినటల్ రిసిప్ట్ తీసుకోవచ్చని కార్యక్రమంలో భాగం పంచుకోవచ్చని కోరారు. మా ఫౌండేషన్ సభ్యులంతా కలిసి బషీర్ బాగ్ లోని బాబూ ఖాన్ ఎస్టేట్ లో ఒక ఫ్లాట్ ఖరీదు చేసి అందులో VBG Foundationని కార్యాలయాన్ని
నడుపుతున్నామని, ఈ ఆఫీస్ VBG Fondation ది మాత్రమే నని  మిగతా వ్యాపారాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని  ఆర్యవైశ్య సోదర సోదరీమణులు గమనించాలని VBG Foundation ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,క్యాన్సర్ రోగులకు జీవితాంతం మందులు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. టెక్నికల్ గా, లీగల్ గా రెండు సంస్థలు వేరు అయినప్పటికీ  లోగా ఒక్కటిగా ఉందని, ప్రసాద్,  రాజు, శ్రీహరి లు వినిజి గ్రూప్ పేరుతో ఈ కార్యాలయం నుండి వ్యవహారాలు చేస్తున్నారని విలేకరుల ప్రశ్నిచడం తో   ఫౌండేషన్ కార్యక్రమాలు తప్ప ఇతర కార్య్రమాలు ఎవరుకూడా నిర్వహించకుండా తీర్మానం చేశామని తెలిపారు.  ఫౌండేషన్ ఎలాంటి లాభాపేక్ష లేని సంస్థ కదా ఈ సంస్థ కార్యక్రమాలు ఆర్యవైశ్య లకు చూపించి మీ పేరు మీ లోగో లాంటి ఉన్న ఆ (దగుల్బాజీ) బిజినెస్ గ్రూప్ నిర్వాహకులు  మీ సంస్థ సభ్యులుగా ఉన్న 6000 వేల మంది తో బిజినెస్ చేయవచ్చు గదా అని ఓ విలేఖరి ప్రశ్నకు మేము  కమిటీ మీటింగ్ పెట్టుకొని ఇలా చేయకుండా ఆ సంస్థ పేరు కూడా మార్పు చేయాలని కోరుతామని తెలుపుతూ ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే వారిని ఫౌండేషన్ నుండి తొలగిస్తామని తెలిపారు.
ఆరోపణలు ఎదుర్కుంటున్న  విబీజి  బిజినెస్ గ్రూప్ నిర్వాహకులతో కలసి ప్రెస్స్ మీట్ నిర్వహించడం దేనికి సంకేతం మో ఫౌండేషన్ నిర్వహులు ఆలోచించు కావాల్సి ఉంది.
వారితో ఫౌండేషన్ నిర్వాహకులు అంటకాగుతూ మాకు వారితో సంబంధం లేదని ఎన్ని ప్రకటనలు ఇచ్చిన ప్రయోజనం శూన్యమని  పలువురు ఆర్య వైశ్యులు పెదవి విరుస్తున్నారు.
ఈ కార్యక్రమంలో  వైస్ ఛైర్మెన్లు  ఇమ్మడి రమేష్, తాటి పల్లి శ్రీనివాస్, ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రసాద్, ఫౌండర్ జనరల్ సెక్రెటరీ మరిపడుగా రాజు, ఇతర సభ్యులు, మహిళ సభ్యులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్