గూఢచారి ఎఫెక్టు తో బిసి వెల్ఫేర్ లో కాలం చెల్లిన టెండర్ల స్థానం లో క్రొత్త టెండర్లకు నోటిఫికేషన్
గూఢచారి ఎఫెక్టు తో బిసి వెల్ఫేర్ లో కాలం చెల్లిన టెండర్ల స్థానం లో క్రొత్త టెండర్లకు నోటిఫికేషన్
నల్గొండ: బిసి వెల్ఫేర్ లో కాలం చెల్లిన టెండర్ల కు ప్రాణం పోస్తున్న అధికారులు అంటూ గూఢచారి న్యూస్ లో నవంబర్ 11 న వచ్చిన వార్త ఎఫెక్ట్ తో అధికారులు కాలం చెల్లిన టెండర్ల కు బదులు క్రొత్త బాక్స్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేశారు.
అయితే ఇక్కడ ఒక ట్విస్టు కూడా ఉన్నట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారు. 5 లక్షల విలువ దాటిన టెండర్లు ను ఆన్లైన్లో ఈ ప్రోక్యూర్మెంట్ ద్వారా కూడా పిలిచే నిబంధనలు ఉన్నాయి. అలా కాకుండా అధికారులు బాక్స్ టెండర్లు పిలిచారు.
బాక్స్ టెండర్లో ఎవరు ఎవరు టెండర్ షెడ్యూళ్లు కొనుగోలు చేశారో తెలుస్తుంది. అంతే కాకుండా టెండర్ వేసే సమయం లో టెండరు దారులు అందరూ కలుసుకునే అవకాశం ఉంటుంది దీనితో వారికి రింగ్ అయ్యే వెసులుబాటు కలుగుతుంది. షెడ్యూళ్లు మార్పు చేయడానికి కూడా అవకాశం ఉంది.
గతం లో బాక్స్ టెండర్ లో టెండరు దారులు రింగ్ అయ్యి షెడ్యూళ్లు మార్పు చేసి ధరలు పెంచుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సారి పునారావృత్తం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కొందరు టెండరు దారులు కోరుతున్నారు.
Comments
Post a Comment