తెలంగాణ సర్కారుకు ఎన్జీటీ భారీ జరిమానా
తెలంగాణ సర్కారుకు ఎన్జీటీ భారీ జరిమానా
దిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. అనుమతుల్లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను చేపడుతోందని ఈ జరిమానా వేసింది.
మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5శాతం (సుమారు రూ.900 కోట్లు) జరిమానా విధిస్తూ ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది.
అనుమతులు లేకుండా నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడా అమలు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
Comments
Post a Comment