Posts

Showing posts from January, 2023

రాజ్‌పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ దాడులు

Image
  రాజ్‌పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ దాడులు 5 వాహనాల్లో వచ్చి సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సంస్థల్లో ఐటీ సోదాలు రాజ్‌పుష్ప, వర్టెక్స్, ముప్పా సంస్థల్లో సోదాలు వసుధ ఫార్మాతోపాటు, రాజ్‌పుష్ప, వర్టెక్స్, ముప్పాలో సోదాలు మొత్తం 51 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఐటీ

ఏసీబీ వలలో డిప్యూటీ తహశీల్దార్

Image
ఏసీబీ వలలో  డిప్యూటీ తహశీల్దార్   నాగర్ కర్నూల్ జిల్లా కోడైర్ మండలం డిప్యూటీ తహశీల్దార్ రసమల్ల పురుషోత్తం పది వేలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడ్డాడు  ఫిర్యాదు దారుడు చీకిరాల నాగేంద్రం తాత నుండి అతని కుమారునికి వ్యవసాయ భూమి యొక్క మ్యుటేషన్ చేయుటకు లంచం డిమాండ్ చేసి డిప్యూటీ తహశీల్దార్ తీసుకున్నారని ఎసిబి తెలిపింది. లంచం మొత్తాన్ని అతని వద్ద నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ యొక్క రెండు చేతుల వేళ్లురసాయన పరీక్షలో సానుకూల ఫలితాన్ని అందించాయని అధికారులు తెలిపారు. రసమల్ల పురుషోత్తం, డిప్యూటీ తహశీల్దార్, కోడైర్ మండలం నాగర్‌కర్నూల్ జిల్లాను అరెస్ట్ చేసి SPE మరియు ACB కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి, హైదరాబాద్ ముందు హాజరు పరిచారు. కేసు విచారణలో ఉందని ఎసిబి అధికారులు తెలిపారు. ఏవరైన పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ చేస్తే, ఫోన్ నంబర్-1064 (టోల్ ఫ్రీ నంబర్) కు ఫోన్ చేస్తే చట్టం ప్రకారం ఏసీబీ చర్య తీసుకుంటుందని అధికారులు ప్రకటించారు. 

మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి కార్పోరేషన్ కొరకు వినతి పత్రం సమర్పణ

Image
 మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి కార్పోరేషన్ కొరకు వినతి పత్రం సమర్పణ  నల్గొండ: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి భవన్ గాంధీ పార్క్ నందు గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. రామగిరి సెంటర్లో గాంధీ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తామని ప్రకటించారని, వైశ్యులలో కూడా చాలా పేదరికంలో ఉన్న జనాభా కూడా ఉన్నారని, ఎంతోమంది పేద వైశ్యులకు కార్పొరేషన్ ప్రకటిస్తే పేద మధ్య తరగతి వారికి ఉపయోగకరంగా ఉంటుందనీ పేర్కొంటూ ప్రకటించిన ప్రకారం కార్పోరేషన్ లేదా వైశ్య బంధు ఏర్పాటుకు పాలకులకు మనసు కల్పించాలని గాంధీ కి వినతి పత్రం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో లోపు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో మాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ లేదా వైశ్య బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు యామా మురళి కృష్ణ, కార్పొరేషన్ సాధన సమితి కన్వీనర్లు దుండిగళ్ళ ఓం ప్రసాద్, నల్లగొండ అశోక్, మాజీ గౌరవ అధ్యక్షులు భూపతి రాజు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వనమా మనోహర్, పట్టణ సంఘం సెక్రెటరీ జనరల్ నల్లగొండ శ్రీనివాస్,...

పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధన సమితి అధ్వర్యంలో రామగిరి గాంధీ పార్క్ వరకు ర్యాలీ

Image
 పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధన సమితి అధ్వర్యంలో  రామగిరి గాంధీ పార్క్ వరకు ర్యాలీ  సోమవారం నాడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఉదయం 9:30 నిమిషాల కు  నల్లగొండ వాసవి భవనం లో మహాత్మాగాంధీ గారికి నివాళులు అర్పించి అనంతరం తెలంగాణ ప్రభుత్వం (BRS పార్టీ) 2018 ఎన్నికల సమయంలో మెనిపేస్ట్ లో పెట్టిన విదంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ లేదా ఆర్యవైశ్య బంధు వెంటనే ప్రకటించాలని కోరుతూ వాసవి భవన్ ( గాంధీ పార్కు) నుండి ప్రకాశం బజార్ మీదుగా రామగిరి మహాత్మాగాంధీ విగ్రహం వరకు ఉదయం 10:32 నిముషాల కు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గాంధీ కి వినతిపత్రం మరియు జిల్లా కలెక్టర్ కి విన్నతి పత్రం సమర్పించడం జరుగుతోందని తెలిపారు. పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరిమణులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనవి చేశారు

LIC posts ₹683 crore profit for quarter 1 - assets of ₹41 lakh crore -

Image
 LIC posts ₹683 crore profit for quarter 1 - assets of ₹41 lakh crore -  In the first quarter, the corporation made gross equity investments of Rs 46,444 crore and sales of Rs 12,448 crore, resulting in a net investment of Rs 34,000 crore. The corporation’s assets under management stood at Rs 41 lakh crore — a 7. 6% increase over Rs 38. 1 lakh crore at end of the corresponding quarter of the previous fiscal. LIC owns stocks worth Rs 9.5 lakh crore! In value terms, LIC held Rs 95,274 crore worth Reliance Industries' shares as of December 31. TCS and Infosys were its next two biggest holdings at the end of the December quarter, together amounting to Rs 95,488 crore in value. ITC (Rs 43,557 crore), SBI (Rs 33,855), L&T (Rs 31,960), ICICI Bank (Rs 31,948 and Hindustan Unilever (Rs 24,747 crore) were among its biggest holdings as of December 31 in value terms. As of September 30, 2022, the Life Insurance Corporation of India's (LIC) total equity portfolio was worth approximatel...

యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం

Image
*యాదాద్రి పుణ్యక్షేత్రంలో సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం* యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిర్మించిన సరికొత్త ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వారం రోజుల్లోగా ప్రారంభం కానుంది. తుది దశలో రంగులతో హంగులు దిద్దుకుంటోంది. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పం మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపొందించే లక్ష్యంతో వైటీడీఏ భూసేకరణ చేపట్టింది.  ఈ క్రమంలోనే ఇక్కడ పటిష్ఠమైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు కొండ కింద అయిదెకరాలతో పాటు రూ.6 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో 8,600 చ.అ విస్తీర్ణంలో బస్‌స్టేషన్‌ నిర్మాణమైంది. ప్రహరీ, ఇతర అవసరాలకు కోటి రూపాయలు వెచ్చించనున్నారు. ఆర్టీసీకి చెందిన డీఈ విష్ణు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. యాత్రికుల రవాణా సౌలభ్యం కోసం నిర్మితమైన ఈ బస్‌స్టేషన్‌ను వచ్చే నెల 1న ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.  

అంశాల స్వామి అకాల మరణం

Image
అంశాల స్వామి అకాల మరణం అంశాల స్వామి ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు గత 32 సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ రకస్ కి బలైన అంశాల స్వామి అనేక పోరాటాలు చేసి నల్గొండ జిల్లాకు మిషన్ భగీరథ నీళ్లు అదే విధంగా శివన్నగూడెం ప్రాజెక్టు సాధనలో అంశాల స్వామి కీలక భూమికి పోషించాడు అంశాల స్వామి కొద్దిసేపటి క్రితం అకాల మరణం యావత్ నల్గొండ జిల్లా ప్రజలను ద్విగ్భ్రాంతికి గురిచేసింది ఆయన మరణం నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ వ్యాధి గురైన బాధితులకు తీరని లోటు  

నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి అపూర్వ రావు IPS

Image
  నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి అపూర్వ రావు IPS  2014 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి జిల్లా పోలీస్ కార్యాలయం నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి అపూర్వ రావు IPS బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరి IPS రామగుండం సి.పి గా బదిలీ కాగా ఆమె స్థానంలో 2014 బ్యాచ్ కు చెందిన శ్రీమతి అపూర్వ రావు IPS బాధ్యతలు స్వీకరించారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ అపూర్వ రావు IPSకి యస్.బి డిఎస్పీ మోగిలయ్య, నల్లగొండ డిఎస్పీ, నరసింహ రెడ్డి,దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు,మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర రావు, సిఐలు, ఆర్.ఐ లు, ఎస్సైలు, డి.పి.ఓ సిబ్బంది ఎస్పీ గారికి స్వాగతం పలికారు.

పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ కాల పరిమితి పెంపు

Image
  పట్టణ ఆర్యవైశ్య సంఘం  కార్యవర్గ కాల పరిమితి పెంపు నల్గొండ వాసవి భవన్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశం లో ప్రస్తుతము ఉన్న పట్టణ అధ్యక్షుడు  యామా మురళి కార్యవర్గాన్ని బిల్డింగ్ అభివృద్ధి చేయుట దృష్ట్యా మరో ఏడాది కొనసాగించుటకు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో బిల్డింగ్ అభివృద్ధి, కార్పోరేషన్ సాధన, మహిళ, యువజన కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు వందనపు వేణు, వాసవి మాత దేవాలయం మాజీ ఛైర్మెన్ పారేపల్లి శ్రీనివాస్, మాజీ పట్టణ గౌరవ అధ్యక్షుడు భూపతి రాజు, FMCG డిస్ట్రిబ్యూటర్ జిల్లా అధ్యక్షుడు అర్థం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుబ్బా శ్రీనివాస్, కాకతీయ కాలనీ జనరల్ సెక్రెటరీ భూపతి లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ ఆర్యవైశ్య సత్రం చెరువుగట్టు ప్రధాన కార్యదర్శి వాస నగేష్, మరియు పట్టణ సంఘం కార్యవర్గ సభ్యులు పట్టణ ప్రధాన కార్యదర్శి  వీరెల్లి సతీష్ కుమార్, కార్యవర్గ సభ్యులు మిర్యాల మహేష్, నల్లగొండ శ్రీనివాస్, పారేపల్లి వెంకన్న , దుండిగళ్ళ ఓం ప్రసాద్, యామా శ్యాం కుమార్, గుం...

కౌటికె విఠల్ కి "ఎన్టీర్ శ్రమశక్తి" పురస్కార ప్రధానం

Image
  కౌటికె విఠల్ కి "ఎన్టీర్ శ్రమశక్తి" పురస్కార ప్రధానం  భారతదేశంలో గల జీవిత బీమా ఏజంట్ల అందరిలో నెం. 1 స్థానాన్ని గత రెండు సంవత్సరాలుగా పొందుతున్న భారతీయ జీవిత బీమా సంస్థ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విఠల్ కు ప్రతిష్టాత్మక "ఎన్టీఆర్ శ్రమశక్తి" అవార్డును ప్రధానం చేశారు. శృతి-లయ ఆర్ట్స్ అకాడెమీ, సీల్వెల్ కార్పోరేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో సినీ నటుడు మురళీమోహన్ కు మరియు కౌటికె విఠలు ఈ అవార్డులు ప్రధానం చేశారు.  కౌటికె విఠల్ తన జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని 23 వ యేట ప్రారంభించి యింతింతై వతుడింతై అన్నట్లు తన జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని నిజామాబాదులో ప్రారంభించి, ఈ రోజు హైదరాబాదులో స్థిరపడి, దేశంలోనే నెం, 1 స్థానాన్ని తెచ్చుకోవడం జీవిత బీమా రంగంలో అంతకు మించిన ప్రగతి మరొకటి లేదని చెప్పవచ్చు. వీరు దేశంలో వున్న నలుమూలల్లో వున్న ఏజెంట్లకు సలహాలు, సూచనలు, వ్యాపార మెళకువలు, తన అనుభవాలను పంచుకుంటారు. దేశం మొత్తంలో కొన్ని వేలసార్లు కన్వెన్షన్ల ద్వారా, సెమినార్ల ద్వారా, గ్రూపుల ద...

ICAR -CRIDA నేషనల్ మెంబర్ గా వీరేళ్ళి చంద్రశేకర్

Image
 ICAR -CRIDA నేషనల్ మెంబర్ గా వీరేళ్ళి చంద్రశేకర్          ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ -సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ జాతీయ మెంబర్ గా బిజేపీ రాష్ట్ర నాయకులు వీరెళ్లి చంద్ర శేకర్ ని ,భారత ప్రభుత్వం(వ్యయ సాయ శాఖ) నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీకి, బిజెపి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జేపీ నడ్డా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు. శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కి, కేంద్ర మంత్రి వర్యులు G. కిషన్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గుజ్జల ప్రేమెందర్ రెడ్డీ ,బంగారు శ్రుతి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తు...నా మీద నమ్మకంతో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ జాతీయ మెంబర్ నియమించనందున నా మీద వుంచిన నమ్మకానికి అనుగుణంగా భారత దేశ రైతుల అభివృధికి కృషిచేస్తానని ఈ సందర్భంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించే విధంగా కృషి చేస్తానని వీరెల్లి చంద్రశేఖర్ తెలిపారు.

పేద అడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

Image
 పేద అడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్  ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో..నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లికి మంగళసూత్రం,మెట్టెలు,చీరె, గాజులు అందజేత. నల్లగొండ జిల్లా, కేశరాజు పల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి సైదులు-వాహిని ల కూతురు బీసీ-డి ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి *శ్రీజ వివాహం కోసం* ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలిసిన సందర్భంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో..*తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో పెళ్ళి కూతురు శ్రీజ తండ్రి; సైదులు, జె.సతీష్, మరియు యాదా నాగేశ్వర్ రావు వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్, మహేష్ గుప్త, ప్రెసిడెంట్ IVF కామారెడ్డి జిల్లా., బాలు గుప్తా IVF సేవాదళ్ చైర్మన్, మాతురి శ్రీకాంత్ టౌన్ వైశ్య సంగం ప్రెసిడెంట్ కామారెడ్డి, మొగిళ్లపల్లి భూమేష్ వైశ్య సంగం సెక్రటరీ కామారెడ్డి, లక్ష్మిపతి (వ్యాపారం) తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Image
 ప్రగతి భవన్:- ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనులను సీఎం కేసీఆర్ కు వివరించిన ఎమ్మెల్యే చిరుమర్తి.. బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్ట్ పూర్తికి నిధులు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. ప్రాజెక్ట్ పూర్తికి అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్..

చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి ని శాలువాతో సత్కరించి న - తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య

Image
  చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి ని శాలువాతో సత్కరించి న - తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య తెలంగాణ టింబర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చకిలం రమణయ్య ఈరోజు చీఫ్ సెక్రటరీ అయినా శ్రీమతి శాంతి కుమారి నీ మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేసినారు. తదుపరి చీఫ్ సెక్రటరీ ద్వారా 2023 కాలమానిని రిలీజ్ చేయించారు. జర ఇందులో పాల్గొన్న వారు జనరల్ సెక్రెటరీ పి గోపికృష్ణ మరియు నేలమడుగుల మురళీకృష్ణ పురోహితులు శ్రీమన్నారాయణ మరియు పని ఉన్నా రు .

మానవత్వం చాటుకున్న టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.

Image
 మానవత్వం చాటుకున్న టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త. తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  మానవత్వం చాటుకున్నారు. ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హపీజ్ పేట వెళ్తూ, లింగంపల్లి మీదుగా పాపిరెడ్డి కాలనీ రోడ్డు లో వెళ్తున్న టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు  మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయాలతో పడి ఉన్న టూ వీలర్ వ్యక్తి ని చూసి చలించిపోయారు. గాయాలతో స్పృహ తప్పి పడిపోయిన అతడిని చూసి దగ్గరకు వెళ్లి, సపర్యలు చేశారు. అనంతరం అతడిని వెంటనే సదరు స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకుల,IVF నాయకుల సహాయంతో ఆటోలో  ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని డాక్టర్ లకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంలో ఆయన వెంట IVF నాయకులు నటరాజ్, కట్ట రవి కుమార్, తదితరులు ఉన్నారు.

దేశభక్తి అంటే ఒకరు చెపితే వచ్చేది కాదు - సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ

Image
 దేశభక్తి అంటే ఒకరు చెపితే వచ్చేది కాదు - సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నల్గొండ: దేశభక్తి అంటే ఒకరు చెపితే వచ్చేది కాదని... యువత చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో ప్రతినిత్యం జరుగుతున్న నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ ద్వితీయ వార్షికోత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనగణమణ ఉత్సవసమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఎగురవేశారు... అనంతరం జాతీయ సమైక్యత మీద జరిగిన పోటీలలో ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లక్షలాదిమంది త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందని అలాంటి మహనీయుల చరిత్ర తెలుసుకుని వారిని అనుసరించడమే మనం వారికి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు...పాఠశాలల, కళాశాలల్లో విద్యార్థుల క్రమశిక్షణ పట్ల యాజమాన్యాలు దృష్టి పెట్టాలని సూచించారు... నాకు రక్తాన్న...

విశ్వహిందూ పరిషత్ సంస్కృతిక ప్రముఖ్ గా బొడ్ల మల్లికార్జున్

Image
  విశ్వహిందూ పరిషత్ సంస్కృతిక ప్రముఖ్ గా బొడ్ల మల్లికార్జున్ హైదరాబాద్:   ధర్మ ప్రసార్ ప్రాంత కార్యదర్శి గా 5ఏళ్ల కాలం లో 8, 780మంది హిందువులు కిరస్తానీ లుగా మారిన వారిని తండాల్లో, గ్రామాల్లో టోలీ సభ్యులసహకారం తో ఘర్ వాపసీ చేయించి ఘన విజయం సాధించిన బొడ్ల మల్లికార్జున్ న్ని సంస్కృతిక ప్రముఖ్ గా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రాంత సమావేశంలో కార్యదర్శి పండరీనాథ్ ప్రకటించారు. రేగుల మధుసూదన్ రావు ని మట్ మందిర్ ప్రముఖ్ గా తెలిపారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యకరిణి సభ్యులు రాఘవులు, రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి, జగదీశ్వర్, సునీత రెడ్డి, యాదగిరి రావు, రాజేశ్వర్ రెడ్డి, కోశాధికారి లక్ష్మీ శేఖర్, వెంకటేశ్వర రాజు, పగుడాకుల బాలస్వామి, సుధాకరయ్య, వాణి సక్కుబాయి, శివరాములు, సుభాష్ చందర్, కుమారస్వామి, ఇసంపల్లి వెంకన్న, రాజేందర్ రెడ్డి , సతీష్ మరియు విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ, జిల్లా, అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దిష్టిపూజ మహోత్సవం

Image
  సూర్యాపేట : దురాజ్ పల్లి పెద్దగట్టులో అర్ధరాత్రి దాటాక ఘనంగా జరిగిన దిష్టిపూజ మహోత్సవం. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరిగే జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు ఆనవాయితీగా చేసే తొలి ఘట్టమైన దిష్టిపూజ. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయపాలెం నుంచి సూర్యాపేట మండలం కేసారంకు తెచ్చిన అందెనపు సౌడమ్మ దేవరపెట్టెకు పూజలు చేసి గుట్టకు తరలించిన యాదవులు. సాంప్రదాయం ప్రకారం దిష్టిపూజ నిర్వహించిన యాదవులు.

సైక్లింగ్ రైడ్ ను ప్రారంభించిన రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
  సైక్లింగ్ రైడ్ ను ప్రారంభించిన రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  *సైక్లింగ్ రైడ్ చార్మినార్ టు వరంగల్ ఫోర్ట్ హిస్టారికల్ 150 కి.మీ.రైడ్ ను ప్రారంభించిన.. రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఈరోజు హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర KNR Cycling Event's కె.నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన *CYCLING RIDE CHARMINAR TO WARANGAL FORT HISTORICAL RIDE 150 KM* సైక్లింగ్ రైడ్ చార్మినార్ టు వరంగల్ ఫోర్ట్ హిస్టారికల్ రైడ్ 150 కి.మీ.ను కార్యక్రమంలో ముఖ్య అతిథిగా *తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..* హాజరై, వారి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ రైడ్ కార్యక్రమంలో 55 మంది సైక్లిస్టు లు పాల్గొన్నారు. *ఈ కార్యక్రమంలో..* కె.ఎస్.రవి ఇన్స్ పెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చార్మినార్, హీరో & డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్,సైక్లిస్టు రవీందర్,తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో మరణించిన బీజేపీ కార్యకర్త కుటుంభానికి గృహనిర్మణానములో బాగస్తున్ని అయితా -: నాగం ఫౌండేషన్ చైర్మన్ బిజెపి రాష్ట్ర నాయకులు నాగం వర్షిత్ రెడ్డి

Image
గుండెపోటుతో మరణించిన బీజేపీ కార్యకర్త కుటుంభానికి గృహనిర్మణానములో బాగస్తున్ని అయితా -: నాగం ఫౌండేషన్ చైర్మన్ బిజెపి రాష్ట్ర నాయకులు నాగం వర్షిత్ రెడ్డి  నల్లగొండ మండలం వెలుగుపెల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పోతేపాక ధర్మయ్య ఇటీవలే గుండెపోటు మరణించిన వారి కుటుంబ సభ్యులకు వారు ఉండటానికి కనీసం ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిసిన వెంటనే వారి స్వగ్రామం వెళ్లి నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు తన వంతుగా బాగస్తున్ని అయితానని ఆ కుటుంభం కు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అండగా ఉంటానని భరోసా కల్పించిన నాగం ఫౌండేషన్ చైర్మన్ బిజెపి రాష్ట్ర నాయకులు నాగం వర్షిత్ రెడ్డి తెలియచేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోతేపాక లింగస్వామి, మరియు భూతు అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు...... 

నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల సంక్షేమ, అభివృద్ధి కోసం కట్టుబడింది - బీజేపీ మైనార్టీ మోర్చ జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా

Image
 నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల సంక్షేమ, అభివృద్ధి కోసం కట్టుబడింది - బీజేపీ మైనార్టీ మోర్చ జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని చింతపల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా   మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల సంక్షేమ, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుంది. కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పతకాలు కింది స్థాయి ప్రజలకు అందే విదంగా కేంద్ర  ప్రభుత్వం పనిచేస్తుందని  వెల్లడించారు . ఈతొమ్మిది ఏళ్ల కాలంలో BRS ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని తెలంగాణ అమరవీరుల ఆంక్షలు, ఉద్యమ ఆశయాలు నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు సంక్షేమo, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందన్నారు. సాహసోపితమైన త్రిబుల్ తలాక్ బిల్లు తీసుకవచ్చీ మహిళల భద్రతకు పెద్దపీట వేసిందన్నారు .అనేక పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో మైనార్టీల ఆప్యాయతను కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం చురగుంటుందన్నారు...

భూపతి టైమ్స్, గూఢచారి పత్రికల క్యాలెండర్ ను ఆవిష్కరించిన టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
  భూపతి టైమ్స్, గూఢచారి పత్రికల క్యాలెండర్ ను ఆవిష్కరించిన టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త హైదరాబాద్: గత రెండు దశబ్దాలుగా వెలువడుతున్న భూపతి టైమ్స్, గూఢచారి పత్రికల నూతన సంత్సర క్యాలెండర్ ను మాదాపూర్ ఐ స్టే హోటల్ లో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ భూపతి టైమ్స్, గూఢచారి పత్రికలు నిజాలను నిర్భయంగా ప్రజలకు అందించడం లో ముందుంటాయని అన్నారు. కార్యక్రమంలో ఎడిటర్ భూపతి రాజు, హైదరాబద్ జిల్లా IVF పిఆర్వో గంప సత్యనారాయణ, హాఫిజ్ పేట్ IVF అధ్యక్షుడు కందికొండ యాదగిరి, పీ. వీరేశం, పీ. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Bhupathitimes 20th Jan. 2023

 

రౌడీషీటర్ దారుణ హత్య..

Image
 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ దారుణ హత్య.. రౌడీషీటర్ అజహర్ ను దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు ఎంఎస్ ముక్తా కు చెందిన అజహర్ అజహర్ హత్యకు కుటుంబ కలహాలే కారణంగా భావిస్తున్న పోలీసులు.. మృతదేహని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

రేపు బిజేవైఎం అధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Image
రేపు బిజేవైఎం అధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం నల్గొండ: విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని అన్ని మండల, పట్టణ కూడలిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేవైఎం నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఐతరాజు సిద్దు తెలిపారు. తెలంగాణలో Kcr పాలన మొత్తం విద్యార్థులను అణచివేసే ధోరణితో నడుస్తుంది. నిత్యం రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతు విద్యార్థులను పట్టించుకోకుండా నిరుపేదలను విద్యకు దూరం చేస్తున్నారు. స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ రాక కాలేజీ యజమాన్యాలు విద్యార్థులను ముక్కుపిండి ఫీజులు వసూలు చేయడం, చెల్లించని విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపుతున్న సందర్భంలో పేద విద్యార్ధులు పై చదువులకు నోచుకోని దుస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యావ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా అవుతున్న తనకేం పట్టనట్టుగా ఉంటున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలి లేదా రాజీనామా చేయాలని BJYM డిమాండ్ చేస్తుంది.  డిమ...

మైనారిటీల పట్ల BRS రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు - జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చ

Image
  మైనారిటీల పట్ల BRS రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు - జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చ నల్గొండ: మైనారిటీల పట్ల BRS రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, కెసిఆర్ ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చ డిమాండ్ చేసింది. 2024 అధికారమే లక్ష్యంగా నల్గొండ జిల్లా కార్యాలయంలో మైనార్టీ జిల్లా శాఖ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా గారూ మాట్లాడుతూ 9 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని, అభివృద్ధిని మరిచిపోయింది,,,. మైనారిటీల సంక్షేమ అభివృద్ధి అంటే రంజాన్ తోఫా షాది ముబారక్ లేనా. నిధులు కేటాయించలేక మైనారిటీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. మైనార్టీ వర్గాల జీవనోపాధి కోసం ఈ ప్రభుత్వం ఇన్నేళ్ల నుండి ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ వర్గాల జీవనోపాధి కోసం మైనార్టీ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో మైనారిటీ కార్పొరేష...

*కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*

Image
  *కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి* నల్గొండ: ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటు కంటి సమస్యలను పరిష్కరించేందుకు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని చేపట్టిందని నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. . 100 రోజులు పాటు నిర్వహించే ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం స్థానిక 42 వ వార్డు ఆర్ .టి .సి . కాలనీలో ని ఐ .యం .ఏ . భవన్ లో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలిసి నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించి స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం శిబిరం లో పరీక్షలు నిర్వహించుకున్న పలువురి కి ఆయన రీడింగ్ కళ్ళ ద్ధాలు, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరు...

కంచర్ల ఆధ్వర్యంలో 500 కు పైగా కార్లతోభారీ కాన్వాయ్

Image
  కంచర్ల ఆధ్వర్యంలో  500 కు పైగా కార్లతోభారీ కాన్వాయ్  నేడు భారత రాష్ట్ర సమితి ఖమ్మం లో నిర్వహిస్తున్న  బహిరంగ సభకు కంచర్ల ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్. 500 కు పైగా కార్లతో ఎన్జీ కాలేజీ నుండి  భారీ ర్యాలీ...  ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి   పార్టీ నాయకులు.. అభిమానులు స్వచ్ఛందంగా తమ తమ స్వంత వాహనాలతో భారీగా సభకు.... పోరాడి తెచ్చిన తెలంగాణను  అభివృద్ధి సంక్షేమ పథకాలతో.. దేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దిన కెసిఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నందునే BRS పార్టిగా ప్రజలలోకి.వెళుతుందని పేర్కొన్న కంచర్ల.  ర్యాలీలో మున్సిపల్, మున్సిపల్ చైర్మన్  మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,  ఎంపీపీలు కరీం పాషా, నాగులవంచ విజయలక్ష్మి,లింగారావు  BRS పార్టీ రాష్ట్ర నాయకులు, చీర పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, బోయపల్లి కృష్ణారెడ్డి, సుంకరి మల్లేష్ గౌడ్, బొర్ర సుధాకర్, మాలే శరణ్య రెడ్డి, ఫరీదోద్దీన్,సింగం రా...

3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Image
 3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల దిల్లీ: నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఫిబ్రవరి 16న త్రిపురలో.. ఫిబ్రవరి 27న మేఘాలయ, నాగాలాండ్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొంది.

నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సిఎంలు

Image
   నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సిఎంలు సీఎం కేసీఆర్ ఆద్వర్యంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌. అనంతరం శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు తిలకించారు. ఆలయ ప్రాశస్త్యం, ఆధునీకరించిన విధానం గురించి సీఎం కేసీఆర్ ఇతర సీఎంలకు, నేతలకు వివరించారు. 

BRS అదినేత..సీఎం కేసీఆర్ తో ముఖ్యమంత్రుల భేటీ..

Image
 

మైనర్ బాలిక ను అత్యాచారం జరిపి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి - పాలడుగు ప్రభావతి

Image
  మైనర్ బాలిక ను అత్యాచారం జరిపి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి - పాలడుగు ప్రభావతి                     నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేట గ్రామంలో మైనరు బాలికను (14సంవత్సరాలు 10వ తరగతి) బస్సు స్టేజి వద్ద దింపుతామని కారులో ఎక్కించుకొని ముగ్గురు యువకులు నరేష్ దిలీప్ శివ లు తమ వస్త్ర దుకాణంలోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపి తీవ్రమైన రక్తస్రావంతో బాలిక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని  కోరుతు జిల్లా ఎస్పి కి వినతి పత్రం సమర్పించిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(AIDWA)  జిల్లా ప్రధాన కార్యదర్శి    పాలడుగు ప్రభావతి                       

bhupathitimes 18th Jan 2023

Image
 

20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్

Image
  20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్  పార్సిగుట్ట TSSPDCL ADE (ఆపరేషన్స్), ఆఫీస్ సబ్ ఇంజనీర్ జి.  నరేష్, లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఫిర్యాదుదారు శ్రీ O.G. సుర్జీత్ సింగ్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కు వర్క్ ఆర్డర్‌ను ప్రాసెస్ చేయడానికి మరియు అప్పగించడానికి  రూ.20,000/- మొత్తం డిమాండ్ . చేయడంతో ఫిర్యాదు దారుడు ఎసిబి ని ఆశ్రయించడంతో  వారు వలపన్ని పట్టుకున్నారు. లంచం డబ్బును ఎసిబి అధకారులు స్వాధీన పరచుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి ఎసిబి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. కేసును విచారణ జరుపుతున్నట్లు ఎసిబి  అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా ఎసిబి అధికారులు కోరారు.  

ఎన్నారైని మోసం చేసిన అంబర్‌పేట సీఐ సుధాకర్ అరెస్ట్

Image
  ఎన్నారైని మోసం చేసిన అంబర్‌పేట సీఐ సుధాకర్ అరెస్ట్ హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట సీఐ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూమి వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసగించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆయనను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్‌ను రిమాండ్ కు తరలించనున్నారు. కందుకూరు మండల పరిధిలో ఓ భూమిని రూ. 50 లక్షలకు ఇప్పిస్తానన్న సుధాకర్.. ఓ ప్రవాస భారతీయుడు(ఎన్నారై)కి చెప్పాడు. దీంతో అతను సుధాకర్ ను నమ్మి పలు దఫాల్లో రూ. 50 లక్షలు ఇచ్చాడు. అయితే, ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తూ సస్పెండ్ కు గురైన రాజేశ్ ను ఎమ్మార్వోగా ఎన్నారైకి పరిచయం చేశాడు సుధాకర్. రాజేశ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారని నమ్మించాడు. మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ లాండ్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఎన్నారై  తాను మోసపోయానని గ్రహించి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు, భూమికి సంబంధించిన అన్ని వివరాలను పోలీసులకు అందించాడు. ఆ వివరాలన్నీ పక్కాగా ఉండటంతో సుధాకర్, రాజేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

8 వేల లంచం తో ఎసిబి కి చిక్కిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్

Image
  8 వేల లంచం తో ఎసిబి కి చిక్కిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్: బహదూర్‌పురా పోలీస్ స్టేషన్,   ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్  అర్.శ్రవణ్ కుమార్ రూ.8,000/-లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి ఫిర్యాదుదారు శ్రీ ఎండీ ముజీబ్ నుండి  స్వీకరించినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా  ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదు దారు కొడుకు పై ఆరోపించబడ్డ చీటింగ్ కేసు తప్పించడానికి మరియు అతని సెల్ ఫోన్ తిరిగి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశాడు. స్వీకరించిన లంచం మొత్తం రూ.8,000/- లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు యొక్క కుడి చేతి వేళ్లు రసాయన పరీక్షలో సానుకూల ఫలితాన్ని ఇచ్చాయని ఎసిబి తెలిపింది. నిందితుడు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్.శ్రవణ్ కుమార్ ను అరెస్ట్ చేసి ఎసిబి కేసుల కోర్టు జడ్జి ముందు హాజరు పరిచామని, కేసు విచారణ జరుగుతుందని ఎసిబి అధికారులు తెలిపారు. , 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారికి శుభాకాంక్షలు తెలిపిన టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారికి శుభాకాంక్షలు  తెలిపిన టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త   హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి  గా శ్రీమతి. ఎ.శాంతి కుమారి గారు నియమించబడిన సందర్భంగా  వారి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్  ఉప్పల శ్రీనివాస్ గుప్త.

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి

Image
  తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియమితులయ్యారు. ఇప్పటి వరకు సీఎస్‌గా వున్న సోమేశ్ కుమార్‌ను కేంద్రం తెలంగాణ నుంచి రిలీవ్ చేసి ఏపీ కేడర్‌కు అప్పగించడంతో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక అనివార్యమైంది. సీఎస్ రేసులో రామకృష్ణారావు, శాంతి కుమారిలు పోటీపడగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతికుమారి వైపు మొగ్గుచూపారు. దీంతో ఆమె తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనిపై కాసేపట్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. శాంతికుమారి 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో సీఎంవోలో పనిచేసిన అనుభవం ఆమెకు వుంది. 2025 ఏప్రిల్ వరకు శాంతికుమారి తెలంగాణ సీఎస్‌గా కొనసాగనున్నారు