20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్
20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్
పార్సిగుట్ట TSSPDCL ADE (ఆపరేషన్స్), ఆఫీస్ సబ్ ఇంజనీర్ జి. నరేష్, లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు
ఫిర్యాదుదారు శ్రీ O.G. సుర్జీత్ సింగ్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కు వర్క్ ఆర్డర్‌ను ప్రాసెస్ చేయడానికి మరియు అప్పగించడానికి రూ.20,000/- మొత్తం డిమాండ్ . చేయడంతో ఫిర్యాదు దారుడు ఎసిబి ని ఆశ్రయించడంతో వారు వలపన్ని పట్టుకున్నారు. లంచం డబ్బును ఎసిబి అధకారులు స్వాధీన పరచుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి ఎసిబి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. కేసును విచారణ జరుపుతున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా ఎసిబి అధికారులు కోరారు.
Comments
Post a Comment