8 వేల లంచం తో ఎసిబి కి చిక్కిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్


 

8 వేల లంచం తో ఎసిబి కి చిక్కిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్

హైదరాబాద్:
బహదూర్‌పురా పోలీస్ స్టేషన్,   ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్  అర్.శ్రవణ్ కుమార్ రూ.8,000/-లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి ఫిర్యాదుదారు శ్రీ ఎండీ ముజీబ్ నుండి  స్వీకరించినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా  ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదు దారు కొడుకు పై ఆరోపించబడ్డ చీటింగ్ కేసు తప్పించడానికి మరియు అతని సెల్ ఫోన్ తిరిగి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశాడు. స్వీకరించిన లంచం మొత్తం రూ.8,000/- లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు యొక్క కుడి చేతి వేళ్లు రసాయన పరీక్షలో సానుకూల ఫలితాన్ని ఇచ్చాయని ఎసిబి తెలిపింది. నిందితుడు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్.శ్రవణ్ కుమార్ ను అరెస్ట్ చేసి ఎసిబి కేసుల కోర్టు జడ్జి ముందు హాజరు పరిచామని, కేసు విచారణ జరుగుతుందని ఎసిబి అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్