ఎన్నారైని మోసం చేసిన అంబర్‌పేట సీఐ సుధాకర్ అరెస్ట్


 


ఎన్నారైని మోసం చేసిన అంబర్‌పేట సీఐ సుధాకర్ అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట సీఐ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూమి వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసగించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆయనను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్‌ను రిమాండ్ కు తరలించనున్నారు.
కందుకూరు మండల పరిధిలో ఓ భూమిని రూ. 50 లక్షలకు ఇప్పిస్తానన్న సుధాకర్.. ఓ ప్రవాస భారతీయుడు(ఎన్నారై)కి చెప్పాడు. దీంతో అతను సుధాకర్ ను నమ్మి పలు దఫాల్లో రూ. 50 లక్షలు ఇచ్చాడు. అయితే, ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తూ సస్పెండ్ కు గురైన రాజేశ్ ను ఎమ్మార్వోగా ఎన్నారైకి పరిచయం చేశాడు సుధాకర్. రాజేశ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారని నమ్మించాడు. మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ లాండ్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఎన్నారై  తాను మోసపోయానని గ్రహించి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు, భూమికి సంబంధించిన అన్ని వివరాలను పోలీసులకు అందించాడు. ఆ వివరాలన్నీ పక్కాగా ఉండటంతో సుధాకర్, రాజేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్