*కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*
*కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి*
నల్గొండ: ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తో పాటు కంటి సమస్యలను పరిష్కరించేందుకు కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని చేపట్టిందని నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. . 100 రోజులు పాటు నిర్వహించే ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు .
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం స్థానిక 42 వ వార్డు ఆర్ .టి .సి . కాలనీలో ని ఐ .యం .ఏ . భవన్ లో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలిసి నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించి స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం శిబిరం లో పరీక్షలు నిర్వహించుకున్న పలువురి కి ఆయన రీడింగ్ కళ్ళ ద్ధాలు, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యం తో ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరచి , అత్యాధునిక పరికరాలను సమకూర్చి మెరుగైన వైద్యం అందిస్తున్నారని , పేద వారు తమతమ పనులలో నిమగ్నమై తమ కంటి సమస్యలను పరిష్కరించుకోవడం లో నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి ని గమనించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ప్రజల వద్దకే వెళ్లి కంటి పరీక్షలు నిర్వహించి వారి కంటి సమస్యలను పరిష్కరించడం తో పాటు అవసరమైన మందులు, కంటి అద్దాలు అందించాలనే ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం లో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,పలువురు జాతీయ పార్టీల నాయకులతో కలిసి ప్రారంభించారని తెలిపారు. 100 రోజులు పాటు నిర్వహించనున్న ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . అనంతరం కంటి వెలుగు కార్యక్రమం పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏ. కొండల్ రావు రచించి ,గానం చేసిన పాటను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆవిష్కరించారు . ఈ కార్యక్రమం లో ఆర్ .డి .ఓ . జయ చంద్రా రెడ్డి , మునిసిపల్ చైర్మెన్ మందడి సైది రెడ్డి , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి , మునిసిపల్ కమిషనర్ డా. కె.వి.రమణా చారి , మునిసిపల్ వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ గౌడ్ , స్థానిక కౌన్సిలర్ పబ్బు సాయి శ్రీ సందీప్ , వైద్య ఆరోగ్య సిబ్బంది , ప్రజా ప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు .
Comments
Post a Comment