కౌటికె విఠల్ కి "ఎన్టీర్ శ్రమశక్తి" పురస్కార ప్రధానం


 

కౌటికె విఠల్ కి "ఎన్టీర్ శ్రమశక్తి" పురస్కార ప్రధానం

 భారతదేశంలో గల జీవిత బీమా ఏజంట్ల అందరిలో నెం. 1 స్థానాన్ని గత రెండు సంవత్సరాలుగా పొందుతున్న భారతీయ జీవిత బీమా సంస్థ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విఠల్ కు ప్రతిష్టాత్మక "ఎన్టీఆర్ శ్రమశక్తి" అవార్డును ప్రధానం చేశారు. శృతి-లయ ఆర్ట్స్ అకాడెమీ, సీల్వెల్ కార్పోరేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో సినీ నటుడు మురళీమోహన్ కు మరియు కౌటికె విఠలు ఈ అవార్డులు ప్రధానం చేశారు. 

కౌటికె విఠల్ తన జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని 23 వ యేట ప్రారంభించి యింతింతై వతుడింతై అన్నట్లు తన జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని నిజామాబాదులో ప్రారంభించి, ఈ రోజు హైదరాబాదులో స్థిరపడి, దేశంలోనే నెం, 1 స్థానాన్ని తెచ్చుకోవడం జీవిత బీమా రంగంలో అంతకు మించిన ప్రగతి మరొకటి లేదని చెప్పవచ్చు. వీరు దేశంలో వున్న నలుమూలల్లో వున్న ఏజెంట్లకు సలహాలు, సూచనలు, వ్యాపార మెళకువలు, తన అనుభవాలను పంచుకుంటారు. దేశం మొత్తంలో కొన్ని వేలసార్లు కన్వెన్షన్ల ద్వారా, సెమినార్ల ద్వారా, గ్రూపుల ద్వారా ఉపన్యసించి ఎందరికో ఆదర్శముగా నిలిచారు. ప్రపంచ నలుమూలల్లో జీవిత బీమా ఉత్పత్తులను మార్కెట్ చేశారు. గత 32 సంవత్సరాలుగా ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన అమెరికాలోని మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ సమావేశానికి అర్హత పొందుతూ, తన వృత్తిలో తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఎంత ఎదిగిననూ ఒదిగి వుండాలనే సూక్తిని నమ్మే కౌటికె విఠల్ ఎంతో నిరాడంబరత ప్రదర్శిస్తారు. మారుమూల నిజామాబాద్ జిల్లా తెలంగాణ నుండి సామాన్య ఎల్.ఐ.సి. ఏజెంటు స్థాయి నుండి యావత్ ఎల్.ఐ.సి. ఏజెంట్ లోకం మెచ్చే విధంగా తన కృషితో, కార్యదక్షతతో, పట్టుదలతో, అకుంఠిత దీక్షతో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగి నేడు యావత్ భారతదేశ ఇన్సూరెన్స్ రంగం మెచ్చే విధంగా, విఠల్ గారినే ఆదర్శంగా తీసుకునే విధంగా అలిండియా నెం.1 స్థానాన్ని చేజిక్కించుకున్న సందర్భంలో, సమాజంలోని అన్ని వర్గాల నుండి మెప్పు పొందుతూ ఈ రోజు శృతిలయ ఆర్ట్స్ అకాడెమీ - సీల్వెల్ కార్పోరేటర్ వారు నిర్వహించిన "ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో" వీరిని ఎంచుకుని "ఎన్టీఆర్ శ్రమశక్తి" పురస్కారాము అందచేశారు. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ ఇంతటి భారీ విజయానికి కారణం పాలసీదారులు నా మీద ఎనలేని నమ్మకం ఉంచారని. పాలసీ దారులు ఇచ్చిన సహాయ సహకారాలు, అలాగే మేమున్నాం అనే ధైర్యం నా ఇంతటి స్థాయికి తీసుకువచ్చిందని అన్నారు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్