మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి కార్పోరేషన్ కొరకు వినతి పత్రం సమర్పణ
నల్గొండ: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి భవన్ గాంధీ పార్క్ నందు గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. రామగిరి సెంటర్లో గాంధీ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తామని ప్రకటించారని, వైశ్యులలో కూడా చాలా పేదరికంలో ఉన్న జనాభా కూడా ఉన్నారని, ఎంతోమంది పేద వైశ్యులకు కార్పొరేషన్ ప్రకటిస్తే పేద మధ్య తరగతి వారికి ఉపయోగకరంగా ఉంటుందనీ పేర్కొంటూ ప్రకటించిన ప్రకారం కార్పోరేషన్ లేదా వైశ్య బంధు ఏర్పాటుకు పాలకులకు మనసు కల్పించాలని గాంధీ కి వినతి పత్రం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలలో లోపు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో మాకు ఆర్యవైశ్య కార్పొరేషన్ లేదా వైశ్య బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు యామా మురళి కృష్ణ, కార్పొరేషన్ సాధన సమితి కన్వీనర్లు దుండిగళ్ళ ఓం ప్రసాద్, నల్లగొండ అశోక్, మాజీ గౌరవ అధ్యక్షులు భూపతి రాజు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వనమా మనోహర్, పట్టణ సంఘం సెక్రెటరీ జనరల్ నల్లగొండ శ్రీనివాస్, నాంపల్లి నరసింహ, ఉపాధ్యక్షులు వనమా రమేష్, వామ్ జిల్లా అధ్యక్షుడు వందనపు వేణు, , గోవిందు బాలరాజు, యువజన సంఘ అధ్యక్షుడు యమ శ్యాం కుమార్, ప్రధాన కార్యదర్శి మిరియాల మహేష్,పట్టణ సంఘం కార్యదర్శులు మిట్టపల్లి నవీన్, భాస్కర్, యువజన సంఘం ఉపాధ్యక్షడు తేలుకుంట్ల శ్రీకాంత్, మహిళా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోమా దీప్తి, ఉపాధ్యక్షురాలు మిరియాల రాధా, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment