ఏసీబీ వలలో డిప్యూటీ తహశీల్దార్
నాగర్ కర్నూల్ జిల్లా కోడైర్ మండలం డిప్యూటీ తహశీల్దార్ రసమల్ల పురుషోత్తం పది వేలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడ్డాడు
ఫిర్యాదు దారుడు చీకిరాల నాగేంద్రం తాత నుండి అతని కుమారునికి వ్యవసాయ భూమి యొక్క మ్యుటేషన్ చేయుటకు లంచం డిమాండ్ చేసి డిప్యూటీ తహశీల్దార్ తీసుకున్నారని ఎసిబి తెలిపింది. లంచం మొత్తాన్ని అతని వద్ద నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ యొక్క రెండు చేతుల వేళ్లురసాయన పరీక్షలో సానుకూల ఫలితాన్ని అందించాయని అధికారులు తెలిపారు. రసమల్ల పురుషోత్తం, డిప్యూటీ తహశీల్దార్, కోడైర్ మండలం నాగర్‌కర్నూల్ జిల్లాను అరెస్ట్ చేసి SPE మరియు ACB కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి, హైదరాబాద్ ముందు హాజరు పరిచారు. కేసు విచారణలో ఉందని ఎసిబి అధికారులు తెలిపారు. ఏవరైన పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ చేస్తే, ఫోన్ నంబర్-1064 (టోల్ ఫ్రీ నంబర్) కు ఫోన్ చేస్తే చట్టం ప్రకారం ఏసీబీ చర్య తీసుకుంటుందని అధికారులు ప్రకటించారు.
Comments
Post a Comment