దేశభక్తి అంటే ఒకరు చెపితే వచ్చేది కాదు - సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ
దేశభక్తి అంటే ఒకరు చెపితే వచ్చేది కాదు - సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ
నల్గొండ: దేశభక్తి అంటే ఒకరు చెపితే వచ్చేది కాదని... యువత చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో ప్రతినిత్యం జరుగుతున్న నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ ద్వితీయ వార్షికోత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనగణమణ ఉత్సవసమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఎగురవేశారు... అనంతరం జాతీయ సమైక్యత మీద జరిగిన పోటీలలో ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లక్షలాదిమంది త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందని అలాంటి మహనీయుల చరిత్ర తెలుసుకుని వారిని అనుసరించడమే మనం వారికి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు...పాఠశాలల, కళాశాలల్లో విద్యార్థుల క్రమశిక్షణ పట్ల యాజమాన్యాలు దృష్టి పెట్టాలని సూచించారు... నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్య్రం ఇస్తాను అని చెప్పిన నేతాజీ జయంతిరోజున ప్రారంభమైన జనగణమణ నిత్యజాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల లో కూడా అమలు చేయాలని, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు కూడా ఉండాలని అన్నారు... ఈ కార్యక్రమంలో నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఘన్ శ్యామ్, ఆరెస్సెస్ విభాగ కార్యవాహ గార్లపాటి వెంకటయ్య, ఉత్సవ సమితి ప్రధాకార్యదర్శి కొలనుపాక రవికుమార్, సహాయ అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చందా శ్రీనివాస్, డాక్టర్ ఇటిక్యాల సింధూర, గుంటి రామకృష్ణ, కోశాధికారి పోలోజు నాగేందర్ , సభ్యులు పొల జనార్దన్, శ్యాంసుందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు ..
Comments
Post a Comment