సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను రిలీవ్‌ చేస్తూ డీఓపీటీ ఉత్తర్వులు


 *సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను రిలీవ్‌ చేస్తూ డీఓపీటీ ఉత్తర్వులు*


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉన్నత న్యాయస్థానం తీర్పు దృష్ట్యా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.


సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఈనెల 12లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీవోపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీస్‌ సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్‌ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్‌ కుమార్‌ రిలీవ్‌ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈనెల 12లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీవోపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్‌ కొనసాగుతున్నారు. క్యాట్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017 లోనే కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం  తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్