రేపు బిజేవైఎం అధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
రేపు బిజేవైఎం అధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
నల్గొండ: విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని అన్ని మండల, పట్టణ కూడలిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేవైఎం నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఐతరాజు సిద్దు తెలిపారు.
తెలంగాణలో Kcr పాలన మొత్తం విద్యార్థులను అణచివేసే ధోరణితో నడుస్తుంది. నిత్యం రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతు విద్యార్థులను పట్టించుకోకుండా నిరుపేదలను విద్యకు దూరం చేస్తున్నారు. స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ రాక కాలేజీ యజమాన్యాలు విద్యార్థులను ముక్కుపిండి ఫీజులు వసూలు చేయడం, చెల్లించని విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపుతున్న సందర్భంలో పేద విద్యార్ధులు పై చదువులకు నోచుకోని దుస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యావ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా అవుతున్న తనకేం పట్టనట్టుగా ఉంటున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలి లేదా రాజీనామా చేయాలని BJYM డిమాండ్ చేస్తుంది.
డిమాండ్స్:
1. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులు, మొదలైన వాటిలో చదువుతున్న దాదాపు 18 లక్షల మంది విద్యార్థులకు 5300 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలి.
2. లక్షలాదిమంది విద్యార్థులు రోడ్డుపాలు అవుతున్న పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి.
3. గత మూడు సంవత్సరాలుగా చెల్లించని ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ లు, అర్ధాంతరంగా చదువుకు దూరం అవుతున్న నిరుపేద విద్యార్థులకు మద్దతుగా BJYM పోరాటాన్ని కొనసాగిస్తుంది.
4. ఒకవైపు బకాయిలు చెల్లించని ప్రభుత్వం , మరోవైపు పూర్తి ఫీజు కట్టాలని యాజమాన్యం మధ్యలో అయోమయ పరిస్థితిలో ఉన్న విద్యార్థులకు అండగా bjym ముందుంటుందని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడినబీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షులు ఐతరాజు సిద్దు అన్నారు. జిల్లా కార్యదర్శి దుబ్బాక సాయి కిరణ్,జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి సాయి,శ్రీకాంత్,పట్టణ అధ్యక్షుడు B.S.V ప్రసాద్,నల్లగొండ మండల అధ్యక్షుడు అనిల్, నరేష్,కిషోర్ ,రాజు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment