మానవత్వం చాటుకున్న టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.
మానవత్వం చాటుకున్న టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.
తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మానవత్వం చాటుకున్నారు. ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హపీజ్ పేట వెళ్తూ, లింగంపల్లి మీదుగా పాపిరెడ్డి కాలనీ రోడ్డు లో వెళ్తున్న టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయాలతో పడి ఉన్న టూ వీలర్ వ్యక్తి ని చూసి చలించిపోయారు. గాయాలతో స్పృహ తప్పి పడిపోయిన అతడిని చూసి దగ్గరకు వెళ్లి, సపర్యలు చేశారు. అనంతరం అతడిని వెంటనే సదరు స్థానిక బీఆర్‌ఎస్ నాయకుల,IVF నాయకుల సహాయంతో ఆటోలో ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని డాక్టర్ లకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంలో ఆయన వెంట IVF నాయకులు నటరాజ్, కట్ట రవి కుమార్, తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment