జర్నలిస్ట్ యూనియన్ వర్గాల స్టేట్మెంట్ ల యుద్ధం
జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు వర్గాల స్టేట్మెంట్ ల యుద్ధం
అల్లం నారాయణ వర్గం
ఐజేయు ప్రెసిడెంట్ వినోద్ కోహ్లీ పిలుపు
ఐజెయు జాతీయ జర్నలిస్టుల మహాసభలు జయప్రదం చేయాలి
- ఐజేయు ప్రెసిడెంట్ వినోద్ కోహ్లీ పిలుపు
జాతీయ స్థాయిలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించేందుకు ఈనెల 8, 9,10 తేదీలలో పటాన్ చెరువులోని జిఎంఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్న అన్ని రాష్ట్రాల జర్నలిస్టుల మహాసభలను జయప్రదం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) అధ్యక్షులు వినోద్ కోహ్లీ జర్నలిస్టులను కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్లతో కలిసి ఆయన మాట్లాడారు. మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల కనీస వేతనాల కోసం గలమెత్తింది తామేనని కోహ్లీ అన్నారు. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై స్పందించి పోరాడింది తమ సంఘమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఐజేయు సభలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మూడు రోజులపాటు జరిగే పదవ ప్లీనరీ సమావేశంలో అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు.
జాతీయ స్థాయిలో ఉద్యమ నిర్మాణానికే ఐజెయు
విద్వేష రాజకీయాల పై జర్నలిస్టులుగా పోరాడుతాం
జర్నలిస్టులకు సమగ్ర చట్టం కోసం కేంద్రాన్ని నిలదీస్తాం.
మీడియా అకాడమీ చైర్మన్, టియుడబ్లుజె అధ్యక్షుడు... అల్లం నారాయణ
భారతదేశంలో ఒక సంకుచిత వాతావరణం, ఒక ఉద్విగ్న వాతావరణం, ఒక విద్వేషపూరిత వాతావరణం, ఒక విభజన వాతావరణం వున్న తరుణంలో.. తెలంగాణ అస్థిత్వం కోసం, తెలంగాణ ప్రజల కోసం టీయూడబ్ల్యూజే ఎట్లా పోరాడిందో.. అట్లాగే జాతీయస్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి మేం ఐజేయూతో కలుస్తున్నాం...అని అల్లం నారాయణ అన్నారు. దాదాపుగా 17 రాష్ట్రాల్లో ప్రతినిధులను కలిగి ఉన్న ఒక పెద్ద సంస్థతో కలిసి పనిచేయడానికి టీయూడబ్ల్యూజే నిర్ణయం తీసుకున్నదన్నారు.
కేంద్రం జర్నలిస్టులకు ఉన్న చట్టాన్ని రద్దు చేసింది గానీ మరో చట్టాన్ని తీసుకు రాలేదని విమర్శించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ....‘‘ దేశంలో మీడియా విస్తృతి పెరిగింది. సాంప్రదాయ మీడియా అయిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు మరియు డిజిటల్ మీడియా వచ్చిన ఈ తరుణంలో ఒక సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం ఏర్పడినందున కేంద్రం దగ్గర కొట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐజేయూతో మేం కలిసి పనిచేయాలనుకున్నం. జాతీయ స్థాయిలో ఇంతకుముందున్న ఐజేయూ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దాని గురించి ఎక్కువ మాట్లాడం లేం. సీఎం కేసీఆర్ వచ్చాక అద్భుతంగా తీర్చిదిద్దిన మన వజ్రాల నగరం, మన హైటెక్ నగరం ఐజేయూ 10వ ప్లీనరీకి సగర్వంగా ఆతిథ్యం ఇస్తున్నది. దాదాపు 20 వేల మందికి అక్రిడియేషన్లు, దానిలో 33% మహిళా రిజర్వేషన్లు, హెల్త్ కార్డు, 19 వేల మందికి ఇన్సూరెన్స్, డెస్క్ జర్నలిస్టులకు ప్రధానంగా టీయూడబ్ల్యూజే చొరవ ఫలితమే. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏకైక యూనియన్ టీయూడబ్ల్యూజే. రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్ ఫండ్ సాధించడంలో గానీ, మీడియా అకాడమీ ఏర్పాటు, దాని తర్వాత కరోనా బారిన పడ్డవారి కోసం దాదాపు రూ.7 కోట్లను ఖర్చు చేయడం వెనుక టీయూడబ్ల్యూజే కృషి ఉన్నది..’’ అని అన్నారు.
తప్పుడు ఆరోపణలు సరికాదు
పీఠాధిపతుల పీఠాలు కదులుతుంటే వోర్వలేకపోతున్నరు
టియుడబ్లుజె ప్రధాన కార్యదర్శి – మారుతి సాగర్
టియుడబ్లుజె ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ మాట్లాడుతూ.. ఐజెయు ప్లీనరీ సమావేశాలపై కొందరు పాత్రికేయులు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో తమ టియుడబ్లుజె సంఘం ఆవిర్భవించిన నాటినుంచి తెలంగాణ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పైనే పూర్తిస్థాయి దృష్టి సారించామని చెప్పారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా పాత్రికేయ కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేశామని అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమాన్ని పట్టించుకోని, ఆ తరువాత పాత్రికేయుల సంక్షేమం పట్టని కొందరు సీనియర్ జర్నలిస్టుల ముసుగులో తప్పుడు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మారుతి సాగర్ దుయ్యబట్టారు. వారికి జర్నలిస్టు సంఘాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోవడం మాత్రమే తెలుసునని ఘాటుగా విమర్శించారు. గడిచిన 40 ఏళ్లుగా జర్నలిస్ట్ లకు యూనియన్ అంటే ఏంటో తెలియకుండా,యూనియన్ సభ్యత్వ రుసుము రసీదు ఇవ్వడానికి కూడా తిప్పుతూ,లోపల లోపల యూనియన్ పేరు చెప్పుకొని కోట్లు కొల్లగొట్టిన వారికి ఇలాంటి నీతులు చెప్పే అర్హత లేదని మారుతీ సాగర్ స్పష్టం చేశారు. కనీసం జర్నలిస్ట్ ని కలవడానికి కి అవకాశం ఇవ్వకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చేసిన పెత్తనం తెలంగాణ జర్నలిస్టులు ఎన్నటికీ మర్చిపోరని దుయ్యబట్టారు. పీఠాధిపతుల పీఠాలు కదులుతున్న వేళ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. నిఖార్సుగా తెలంగాణ కోసం తెగించి కొట్లాడి 14 ఏళ్ళు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ అన్న నినాదంతో ఏ స్వార్థ ప్రయోజనాలు లేకుండా స్వరాష్ట్రం కోసం పోరాడిన చరిత్ర తమ యూనియన్ ది అన్నారు. తెలంగాణ చైతన్యంతో ఆవిర్భవించిన టియుడబ్ల్యుజె పై ఈరోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విషం విషం కక్కిన వారు పేరుకు జర్నలిస్ట్ నాయకులుగా చలామణి అవుతున్నవారేనని ఎద్దేవా చేశారు. ఇటు జర్నలిస్టులను అటు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు ఘటించిన ఈ నేతలు నీతలు చెప్పడం దయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉందని మారుతి సాగర్ స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ పేరిట ప్రభుత్వం స్థలాల్లో బిల్డింగులు కట్టించుకొని కనీసం జర్నలిస్టులను కూడా అడుగుపెట్టనీయకుండా ప్రెస్‌క్లబ్‌లను కబంధహస్తాల్లో పెట్టుకొని లక్షల రూపాయలు నెలకు తమ ఎకౌంట్లో వేసుకుంటూ ఇవాళ మీరు నీతులు చెబుతున్నారా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో ప్రెస్ క్లబ్ పేరు మీద స్థలాన్ని కొట్టేసిన ఈ మహనీయులు ఇక హైదరాబాద్ బషీర్‌బాగ్ లో యూనియన్ కార్యాలయాన్ని పెట్టుకొని కోట్ల రూపాయలు గడిస్తున్నారని తెలిపారు. ప్రెస్ క్లబ్ పేరుతో దాని రిపేర్ల పేరిట ప్రభుత్వం దగ్గర ఇప్పటికే రెండున్నర కోట్లు అప్పనంగా కొట్టేసిన ఈ గజదొంగలు మరో 50 లక్షలకు టెండర్ వేశారని, తినేది మన సొమ్ము పాడేది మంది పాట’ అనే చందంగా మాట్లాడుతున్న వీరి తీరు చూస్తుంటే గురువింద నీతి గుర్తుకొస్తుందని మారుతి సాగర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టియుడబ్లుజె నేతలు, సయ్యద్ ఇస్మాయిల్,రమణ కుమార్, రాజమౌలిచారి, అవ్వారి భాస్కర్, యోగానందం, యార నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
************************************"********
కె. శ్రీనివాస్ రెడ్డి వర్గం:
*నకిలీ ఐజేయూ* *సృష్టికర్తలకు....*
*చట్టపరంగా శిక్ష తప్పదు*
*- ఐజేయూ, టీయుడబ్ల్యుజె* *హెచ్చరిక*
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) నుండి బహిష్కరించిన వారిని, వారి వెంట ఉన్న వ్యక్తులను ఐజెయు నాయకులు అని చెబితే జర్నలిస్టులు ఊరుకోబోరని ఐజెయు, టియుడబ్లుజె హెచ్చరించింది. నకిలీ ఐజేయును సృష్టించి కేవలం ప్రభుత్వ పెద్దల వద్ద తమకు జర్నలిస్టులలో ప్రాబల్యం ఉందని చెప్పుకొని, జర్నలిస్టుల ప్రయోజనాలను పణంగా పెట్టి, వ్యక్తిగత , రాజకీయ పదవులు పొందేందుకే ప్లీనరీ పేరుతో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడింది. చైతన్యవంతులైన తెలంగాణ జర్నలిస్టులు విశ్వసించబోరని, తిరస్కరిస్తారని స్పష్టం చేసింది. హైదరాబాద్ సోమాజీగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఐజెయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టియుడబ్లుజె రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీలు శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఐజెయు ప్లీనరీ పేరుతో తప్పుడు ప్రచారం చేసున్న సంఘంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టు సమస్యలు, సంక్షేమంపై పట్టింపులేని పదవీ కాంక్షా పరులు, పదవే జీవితాశయమనే కోరికలతో మిగిలిన వారు తప్పుడు పద్ధతులలో జర్నలిస్టుల వ్యతిరేక పద్ధతులలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము అనుబంధమని చెప్పుకుంటున్న ఐజెయుకు చెందిన వ్యక్తి ఏనాడైనా కార్మిక శాఖ వద్ద చట్ట ప్రకారం వార్షిక నివేదికలను సమర్పించారా అని ప్రశ్నించారు. ప్రతి ఏటా సభ్యత్వాలు, కమిటీలు, జాతీయ సంఘ అనుబంధ సంఘాల వివరాలు, ఆదాయ, వ్యవయాల ఆడిట్ వివరాలను సమర్పిస్తున్నారా? అని కె.శ్రీనివాస్ రెడ్డి అడిగారు. ఈ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల సంఘాలలో తెలంగాణ తెచ్చింది మేమే , మా ద్వారానే రాష్ట్రం వచ్చిందనే మూర్ఖత్వం కలిగిన సంఘం తొమ్మిదేళ్ళలో ఆ పని చేసిందా? అని ప్రశ్నించారు. కార్మిక చట్టాల ప్రకారం వర్కింగ్ జర్నలిస్టుల సంఘంగా చెప్పుకునే అర్హత వారికి ఏనాడో పోయిందన్నారు. పాలాభిషేకం చేస్తూనే, పాదాల కింద గోతులు తవ్వుతున్నారని విమర్శించారు. ఒక వైపు ప్రభుత్వం మాతోనే ఉందనే అవాస్తవ ప్రకటనలు చేస్తూ, మరో వైపు ప్రభుత్వ పెద్దలను ఆకర్షించేందుకు మాది ట్రేడ్ యూనియన్ అని, మాకు జాతీయ సంఘం ఉందని చెప్పుకొని బతకడానికి అబద్ధాల కోరులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఐజెయు పదవ ప్లీనరీ చేస్తున్నామని, దానికి అనుబంధంగా ఉన్నామని, సమావేశానికి అఖిల భారత నాయకుడు వస్తున్నాడని , ఆయన ఐజెయు తరుపున ప్రెస్ కౌన్సిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఐజెయు తరుపున ప్రెస్ కౌన్సిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పే ధైర్యం ఆ వ్యక్తికి ఉందా? కనీసం వారికి అనుబంధ సంఘంగా చెప్పుకుంటున్న వారు రాతపూర్వకంగా ఈ విషయం చెప్పగలరా అని శ్రీనివాస్ రెడ్డి సవాలు విసిరారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నిర్వీర్యం చేసే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారం సభ్యుల నియామకానికి అక్రమ నోటిఫికేషన్ జారీ చేసిందని, దానిని ఐజెయు, ఐఎఫ్ ఎన్ , ప్రెస్ అసోసియేషన్ తదితర జాతీయ సంఘాలు,
ఐ.ఎన్.ఎస్ వంటి సంస్థలు వ్యతిరేకించాయని, ఢిల్లీ కోర్టులో కేసు వేసాయని వివరించారు. పంజాబ్ రాష్ట్రం చిన్న యూనియన్ నుండి ఆ వ్యక్తి ప్రెస్ కౌన్సిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అంతే తప్ప ఐజెయుకు కాదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఐజెయు నుండి 20, 30 మంది ప్రెస్ కౌన్సిల్ సభ్యులుగా పని చేశారని, సెంట్రల్ అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఉన్నారని ఆయన అన్నారు. తమది ఐజెయు అని చెప్పుకునే వారికి సంఘం పేరుతో ప్రాతినిధ్యం ఉందా? అని ప్రశ్నించారు. కనీసం ఆయన పని చేసిన పంజాబ్ ట్రిబ్యూన్ 14 మందిని సస్పెండ్ చేసినా వ్యక్తిగతంగా లేదా సంఘ పరంగా యాజమాన్యానికి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన ఇవ్వలేదని, ఐజెయునే పోరాడి సస్పెన్షన్ ఎత్తివేయించిందని తెలిపారు. 2011లో హైదరాబాద్ నగరంలో జరిగిన ఐజెయు 7వ ప్లీనరీలో వరుసగా మూడవ సారి అధ్యక్షునిగా కొనసాగాలనే కాంక్షతో ఉన్న వ్యక్తిని ప్లీనరీ బహిష్కరించినప్పుడు, ఆయనతో వెళ్ళి సంఘం పెట్టున్నారని, ఈ వ్యక్తి కూడా వారితో ఉన్నారని చెప్పారు. తిరిగి ఆ సంఘమే ఐజెయులో విలీనమవుతామని ఏకగ్రీవంగా తీర్మానించి, విలీనం చేసిందన్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక లేఖలను శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో విడుదల చేశారు. టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ మాట్లాడుతూ,
గత కొద్ది రోజుల నుండి మీడియా, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమానికి ఎలాంటి అవగాహన లేని కొన్ని శక్తులు, వారి వ్యక్తిగత , రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిస్టు ఉద్యమానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు.143 సంఘం అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరి కోసం పని చేసిందని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపియుడబ్లుజె, తెలంగాణ ఏర్పడిన తరువాత టియుడబ్లుజెకు ఆరు దశాబ్దాల జర్నలిస్టుల ఉద్యమ చరిత్ర ఉన్నదని తెలిపారు. ఎందరో ప్రముఖ, సుప్రసిద్ధ జర్నలిస్టులు, క్షేత్ర స్థాయి నుండి రాష్ట్రా స్థాయి జర్నలిస్టులు ఈ సంఘంలో భాగస్వాములని, వారిని అడిగితే చరిత్ర తెలుస్తుందన్నారు. కనీసం కార్మిక సంఘ నిబంధనలను కూడా పట్టించుకోకుండా కొత్త దుకాణం పెట్టి , తాము ఐజెయు అనుబంధమని ప్లీనరీ జరుపుకుంటున్న వ్యవహారం గతి లేని సంసారానికి మతిలేని మొగుడు వ్యవహారంలాగా ఉన్నదని ఎద్దేవా చేశారు. ఎవరో ఊరు పేరు తెలియని వ్యక్తిని ఐజెయు నాయకుడని చెబుతున్నారని, ఇది వర్కింగ్ జర్నలిస్టు ఉద్యమాన్నే అవమానించడమవుతుందన్నారు. ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ రికార్డులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికార్డులు, కేంద్ర సమాచార శాఖ రికార్డులు పరిశీలిస్తే ఐజెయు ఎవరిదో తెలుస్తుందని, అసలు ఐజెయు పేరు వాడుకునే హక్కు 143 సంఘానికి లేదని, చట్ట ప్రకారం శిక్షకు గురై అభాసు పాలవుతారని విరాహత్ తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవలే చెన్నైలో ఐజెయు పదవ ప్లీనరీ ఘనంగా జరిగిందని, 22 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరయ్యారని, ఐజెయు అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ బల్వీందర్ సింగ్ జమ్మూలతో సహా నూతన కార్యవర్గాన్ని సైతం ఎన్నుకున్నామని చెప్పారు. తాము ఒక జాతీయ సంఘాన్ని తెచ్చామని ప్రభుత్వానికి కల్లబొల్లి మాటలు చెప్పాలని ప్రయత్నిస్తున్నారని, సిఎం కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఐజెయు ఏమిటో, కార్మిక శాఖలో ఎవరి నాయకత్వాన ఐజెయు ఉన్నదో ఆయనకు స్పష్టంగా తెలుసునన్నారు. తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్న సంఘాన్ని మొన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో, నిన్న వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో మట్టికరిపించారని అన్నారు. కనీసం 33 జిల్లాల్లో మహాసభలు పెట్టుకునే శక్తి లేక ఉమ్మడి జిల్లా మహాసభలు పెట్టి, కార్మిక సంఘ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించకుండా కాగితాలపై కమిటీల పేర్లు రాసుకుంటున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఒక నాయకునికి నిద్ర పట్టడం లేదని, నిఘా విభాగాలు ఓటమి ఖాయమని చెబుతుండడంతో జర్నలిస్టుల ఉద్యమాన్ని వాడుకుంటున్నారని అన్నారు. అసలు ఆ నాయకుని స్వంత జిల్లాలో జర్నలిస్టులకు ఏమి చేశారని ప్రశ్నించారు. తమ సంఘం కృషితో దాదాపు 330 మంది జర్నలిస్టులకు ఆ జిల్లాలో ఇళ్ల స్థలాలు, ఇళ్ళు లభించాయన్నారు. టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ప్రయోజనాలను ప్రభుత్వ పాదాల దగ్గర పణంగా పెట్టి పబ్బం గడుపుకుందా మనుకుంటున్న సంఘం మరో నాటకానికి తెర తీసిందని మండిపడ్డారు. జర్నలిస్టులు అనుభవిస్తున్న ప్రతి హక్కు, సంక్షేమ పథకం ఉమ్మడి రాష్ట్రంలో ఎపియుడబ్లుజె, తెలంగాణలో టియుడబ్లుజే పోరాటల ఫలితమేనని చెప్పారు. ప్రభుత్వ సంఘమని వారు చెప్పుకుంటున్నప్పటికీ జర్నలిస్టుల నుండి వారి సభ్యత్వ కార్యక్రమానికి స్పందన రాలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర మహాసభలను రాజకీయ మేళాలాగా చేస్తున్నారని అన్నారు. చాలా మంది 143 నుండి ఐజెయులోకి వస్తుండడంతో , ఇప్పుడు ఐజెయు ప్లీనరీ అంటూ అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎడెనిమిదేళ్లుగా రాష్ట్ర సంఘం ఉన్న వాళ్లకు ఇంత కాలం కూడా జాతీయ స్థాయి సంఘానికి అనుబంధంగా లేకపోయారని చెప్పారు. మహాసభలను నగరంలో పెడతామని ప్రకటించి, నగర శివారులో పెట్టడం వెనక మతలబేంటని ఆయన ప్రశ్నించారు.
***********************************"********
పివికొండల్ రావు
టీయూడబ్ల్యూజే జాతీయ వ్యవహారాల ప్రతినిధి
మీ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తే...
మీ పునాదులు కదులుతుంటే .....
ట్రేడ్ యూనియన్ భావజాలం నచ్చదు. వృత్తిపరమైన జర్నలిస్టుల పక్షాన పోరాటం చేయాల్సిన సందర్భాల్లో కలం కార్మికుల కష్టాలు పట్టవు. సంక్షేమం ఊసులు నచ్చవు. ఎదుటివాళ్ల పై బురుద జల్లి తమనైజాన్ని చాటుకోవడం ఆ నాయకుల శైలి.
ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ ఇవాళ్టి స్థితికి కారకులే “దొంగే దొంగ దొంగ” అన్న చందాన ప్రొఫెషనల్ ట్రేడ్ యూనియన్ లను వేలెత్తి చూపుతున్నారు.
జర్నలిస్టు ఉద్యమ సీనియర్లలోఒకరిగా ఉన్న సురేశ్ అఖౌరీ లాంటి నాయకుల ముక్కుసూటి మనస్తత్వాన్ని సహించని ముఠా ఇప్పుడు భారత జర్నలిస్టు ట్రేడ్ యూనియన్ పునరుజ్జీవాన్ని సహించక నెత్తి నోరు మొత్తుకుంటున్నది.
సాధారణ సభ్యులకు సైతం స్పష్టం గా అర్థమవుతున్న ఈ నిజాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని ఆ నాయకుల ముఠా ఇప్పుడు తెలంగాణా లో జర్నలిస్టుల యూనియన్ల సమారోహాన్ని చూసి జడుసుకొని అవాకులూ చవాకులూ పేలుతున్నది. వాళ్ల కిక కాలం చెల్లింది. ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ ఇప్పుడు ప్రొఫెషనల్ ల చేతిలో అన్ని రాష్ట్రాలకూ విస్తరిస్తున్నది. దిగజారుడు వైఖరి మనల్ని మనం దిగజార్చుకోవడం అవుతుంది. నిజాలు నిలకడగా తెలుస్తాయి.
సమావేశాల్లో జరిగే చర్చలు నిర్మాణాత్మకంగా ఉండాలనుకునే ప్రజాస్వామిక దృక్కోణాన్ని సమర్థిద్దాం.
- పివికొండల్ రావు
టీయూడబ్ల్యూజే జాతీయ వ్యవహారాల ప్రతినిధి
***********************************"********
*గురివింద గింజలు నీతులు చెబుతున్నాయి
కోట్ల రూపాయల నిధులు లెక్కలు చెప్పండి ఛీ...నివాస్ రెడ్డి.
టియుడబ్లుజె ప్రధాన కార్యదర్శి – మారుతి సాగర్*
టియుడబ్లుజె ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ మాట్లాడుతూ.. ఐజెయు ప్లీనరీ సమావేశాలపై కొందరు పాత్రికేయులు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో తమ టియుడబ్లుజె సంఘం ఆవిర్భవించిన నాటినుంచి తెలంగాణ పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పైనే పూర్తిస్థాయి దృష్టి సారించామని చెప్పారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా పాత్రికేయ కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేశామని అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమాన్ని పట్టించుకోని, ఆ తరువాత పాత్రికేయుల సంక్షేమం పట్టని కొందరు సీనియర్ జర్నలిస్టుల ముసుగులో తప్పుడు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మారుతి సాగర్ దుయ్యబట్టారు. వారికి జర్నలిస్టు సంఘాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోవడం మాత్రమే తెలుసునని ఘాటుగా విమర్శించారు.
గడిచిన 40 ఏళ్లుగా జర్నలిస్ట్ లకు యూనియన్ అంటే ఏంటో తెలియకుండా,యూనియన్ సభ్యత్వ రుసుము రసీదు ఇవ్వడానికి కూడా తిప్పుతూ,లోపల లోపల యూనియన్ పేరు చెప్పుకొని కోట్లు కొల్లగొట్టిన వారికి ఇలాంటి నీతులు చెప్పే అర్హత లేదని మారుతీ సాగర్ స్పష్టం చేశారు. కనీసం జర్నలిస్ట్ ని కలవడానికి కి అవకాశం ఇవ్వకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చేసిన పెత్తనం తెలంగాణ జర్నలిస్టులు ఎన్నటికీ మర్చిపోరని దుయ్యబట్టారు. పీఠాధిపతుల పీఠాలు కదులుతున్న వేళ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. నిఖార్సుగా తెలంగాణ కోసం తెగించి కొట్లాడి 14 ఏళ్ళు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ అన్న నినాదంతో ఏ స్వార్థ ప్రయోజనాలు లేకుండా స్వరాష్ట్రం కోసం పోరాడిన చరిత్ర తమ యూనియన్ ది అన్నారు. తెలంగాణ చైతన్యంతో ఆవిర్భవించిన టియుడబ్ల్యుజె పై ఈరోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విషం విషం కక్కిన వారు పేరుకు జర్నలిస్ట్ నాయకులుగా చలామణి అవుతున్నవారేనని ఎద్దేవా చేశారు. ఇటు జర్నలిస్టులను అటు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు ఘటించిన ఈ నేతలు నీతలు చెప్పడం దయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉందని మారుతి సాగర్ స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ పేరిట ప్రభుత్వం స్థలాల్లో బిల్డింగులు కట్టించుకొని కనీసం జర్నలిస్టులను కూడా అడుగుపెట్టనీయకుండా ప్రెస్‌క్లబ్‌లను కబంధహస్తాల్లో పెట్టుకొని లక్షల రూపాయలు నెలకు తమ ఎకౌంట్లో వేసుకుంటూ ఇవాళ మీరు నీతులు చెబుతున్నారా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో ప్రెస్ క్లబ్ పేరు మీద స్థలాన్ని కొట్టేసిన ఈ మహనీయులు ఇక హైదరాబాద్ బషీర్‌బాగ్ లో యూనియన్ కార్యాలయాన్ని పెట్టుకొని కోట్ల రూపాయలు గడిస్తున్నారని తెలిపారు. ప్రెస్ క్లబ్ పేరుతో దాని రిపేర్ల పేరిట ప్రభుత్వం దగ్గర ఇప్పటికే రెండున్నర కోట్లు అప్పనంగా కొట్టేసిన ఈ గజదొంగలు మరో 50 లక్షలకు టెండర్ వేశారని, తినేది మన సొమ్ము పాడేది మంది పాట’ అనే చందంగా మాట్లాడుతున్న వీరి తీరు చూస్తుంటే గురువింద నీతి గుర్తుకొస్తుందని మారుతి సాగర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టియుడబ్లుజె నేతలు,సయ్యద్ ఇస్మాయిల్,రమణ కుమార్ రాజమౌలిచారి, అవ్వారి భాస్కర్, యోగానందం, యార నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
***********************************"********
మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కొరకు కోసమే క్రొత్త దుకాణం
విరహత్ అలి వీడియో .
Comments
Post a Comment