కాంతి ఫార్మా అనుమతులు రద్దు


 

కాంతి ఫార్మా అనుమతులు రద్దు

నల్గొండ జిల్లా

గట్టుప్పల్ మండలంలో ఏర్పాటు చేస్తున్న కాంతి లేబరేటరీస్ ఫార్మా కంపెనీ అనుమతులను రద్దు చేస్తూ నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి  ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 6న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గట్టుప్పల మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గట్టుపల్ గ్రామ సర్పంచ్ కుమారి విడమ్ రోజా మంత్రి కేటీఆర్ దృష్టికి ఫార్మా కంపెనీని రద్దు చేయాలని విషయాన్ని తీసుకువచ్చారు. ఫార్మా కంపెనీ వల్ల జరగబోయే నష్టాలను మంత్రికి వివరించారు. గత సంవత్సరం కాలంగా ఈ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని పరిసర గ్రామాల ప్రజలు కూడా ఆందోళనలు చేసినట్లు రోజా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ఫార్మా కంపెనీ అనుమతులు రద్దు చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రజా ప్రతినిధుల వినతులు, మంత్రి ఆదేశాలను పరిశీలించిన మీదట సోమవారం కాంతి లేబరేటరీస్ ఫార్మా కంపెనీ నిర్మాణ అనుమతులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. .

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్