మైనారిటీల పట్ల BRS రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు - జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చ


 

మైనారిటీల పట్ల BRS రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు - జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చ


నల్గొండ: మైనారిటీల పట్ల BRS రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, కెసిఆర్ ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చ డిమాండ్ చేసింది.

2024 అధికారమే లక్ష్యంగా నల్గొండ జిల్లా కార్యాలయంలో మైనార్టీ జిల్లా శాఖ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ పాషా గారూ మాట్లాడుతూ

9 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని, అభివృద్ధిని మరిచిపోయింది,,,. మైనారిటీల సంక్షేమ అభివృద్ధి అంటే రంజాన్ తోఫా షాది ముబారక్ లేనా. నిధులు కేటాయించలేక మైనారిటీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. మైనార్టీ వర్గాల జీవనోపాధి కోసం ఈ ప్రభుత్వం ఇన్నేళ్ల నుండి ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ వర్గాల జీవనోపాధి కోసం మైనార్టీ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో మైనారిటీ కార్పొరేషన్ను ఉత్సవ విగ్రహం లా మార్చారు అని,బలమైన ఓటు బ్యాంకు కలిగిన మైనారిటీలను టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తమ స్వార్థం కోసం వాడుకుంటుందని ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి మైనారిటీలను ఓట్లను దండుకుంటున్నారు నీ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అర్హులైన మైనార్టీలకు రుణాలు మంజూరు చేసి, వాళ్ళ జీవనోపాధికి సహకారం అందించాలని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా మైనార్టీ శాఖ డిమాండ్ చేస్తా ఉంది లేనియెడల మైనారిటీల సంఘటిత శక్తితో BRS ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనార్టీ వర్గాల సంక్షేమ, అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తూ ఉంది అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జావిద్ గారు సయ్యద్ అబ్రారర్ గారు,రెహమాన్ గారు యూసుఫ్ గారు మరియు షరీఫ్ గారు ఇతర నాయకులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్