పట్టణంలోని 40శాఖలు, 40 ధ్వజాలతో ఒకే మైదానంలో ఏకకాలంలో





దేశ రక్షణ, ధర్మపరిరక్షణ కోసం ప్రతి ఒక్క స్వయం సేవకుడు   సైనికునిలా పనిచేయాలని రాష్ట్రీయస్వయం సేవక్ ఉమ్మడి నల్లగొండ జిల్లాప్రచారక్. ప్రాంత బౌద్దక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్ అన్నారు.... ప్రతి స్వయంసేవక్ ప్రత్యక్షంగా శాఖలో పాల్గొనే విధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా "ఉపస్థితిదిన్" కార్యక్రమం నిర్వహిస్తున్నారు... ఈ క్రమంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉపస్ధిత్ దివస్ కార్యక్రమంలో పట్టణంలోని 40శాఖలు,  40 ధ్వజాలతో ఒకే మైదానంలో ఏకకాలంలో కలుసుకునే అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతం అయ్యింది...   వెయ్యి మందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్న  ఈ కార్యక్రమంలో రోజువారి శాఖా కార్యక్రమాలు, ఆసనాలు  నిర్వహించారు... అనంతరం జరిగిన  కార్యక్రమంలో వెంకటశివకుమార్ మాట్లాడుతూ.... 2025లో నాటికి ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాఅలు జరుగతున్నాయని అప్పటి లోగా దేశంలో లక్ష గ్రామల్లో శాఖలు నిర్వహించాలనేది లక్ష్యంగా నిర్వణయించుకుని ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు... రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నైజాం విముక్త అమ్రుతోత్సవాలు జరుపుకుంటున్నామని... అయితే మన గత చరిత్ర తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారని అన్నారు... దేశంలో తమ స్వాతంత్ర్యాన్ని తెలుసుకోలేని, జరుపుకోలేని జాతి ఏదైనా ఉందంటే అది తెలంగాణా ప్రజలు మాత్రమేనని అన్నారు... అలాంటి వారిని జాగ్రుతం చేసి చరిత్రను తెలియ చెప్పే పనిని సంఘం స్వీకరించిందని అన్నారు... ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ విభాగ్ (ఉమ్మడి నల్లగొండ జిల్లా) సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య, పట్టణ ప్రముఖులు, స్వయంసేవకులు పాల్గొన్నారు...

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్