ఒకే రోజు రెండు ACB రైడ్స్
ఒకే రోజు రెండు ACB రైడ్స్
మొదటిది అదిలాబాద్ జిల్లాలో:
అదిలాబాద్ లో రెండు లక్షల 25 వేల లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ జిల్లా
ఉపాధి అధికారి, బాషబోయిన కిరణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్, రిమ్స్ .ఎన్.తేజ, మరియు జూనియర్ ఉపాధి అధికారి విజయలక్ష్మి లు మంగళవారం ఫిర్యాదుదారు దుర్గం SC లేబర్ కాంట్రాక్టర్ దుర్గం శేఖర్ కు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిందుకు లంచం డిమాండ్ చేశరు. జూనియర్ అసిస్టెంట్, రిమ్స్ .ఎన్.తేజ, మరియు జూనియర్ ఉపాధి అధికారి విజయలక్ష్మి ల ద్వారా జిల్లా ఉపాధి అధికారి, బాషబోయిన కిరణ్ కుమార్ లంచం తీసుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ముగ్గురు అధికారులను అరెస్టు చేసి కరీంనగర్ ఎసిబి ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. కేసు విచారణ లో ఉన్నదని అధికారులు తెలిపారు.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
రెండవది ఖమ్మం జిల్లాలో
ఖమ్మం జిల్లా రూరల్ మండలంఎదులాపురం, గ్రామపంచాయతీ పంచాయత్ సెక్రటరీ సయ్యద్ మహబూబ్ పాషా ఫిర్యాదు దారుడు దాసబోయిన నాగేశ్వరరావు కు ఇంటి నంబర్ అలాట్ చేయుటకు మంగళవారం రోజు మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల కు 6 వేలు లంచం ఫిర్యాదు దారుడు నుండి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. రసాయన పరీక్ష లో నిందితుడు లంచం తీసుకున్నట్లు రుజువు అయ్యిందని, లంచం మొత్తాన్ని ముద్దాయి నుండి నుండి స్వాధీనం చేసుకున్నామని ఎసిబి అధకారులుం తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్ ఎసిబి కోర్టు జడ్జి ముందు హాజరపరిచారు.కేసు విచారణలో ఉందని అధికారులు తెలిపారు.
ఎవరైనా ప్రభుత్వ అధికారులు,ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయవచ్చని, లంచం డిమాండ్ చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎసిబి అధికారులు తెలిపారు.
Comments
Post a Comment