పిసిబి AEE కి 6000 జరిమానా విధించిన రాష్ట్ర సమాచార కమీషన్


పిసిబి AEE కి 6000  జరిమానా విధించిన  రాష్ట్ర  సమాచార కమీషన్


నల్గొండ: గతంలో   కొత్తగూడెంలోనీ కాలుష్య నియంత్రణ మండలి  నందు  సమాచార హక్కు చట్టం  ప్రజా సమాచార అధికారిగా  విధులు  నిర్వర్తించిన  అసిస్టెంట్ ఎన్విరాన్మంటల్ ఇంజనీర్ కు తెలంగాణ రాష్ట్ర  సమాచార కమీషన్. 6000  రూపాయల జరిమానా విధించింది.  ఓ ధరకాస్తు దారుడు సమాచారం కోరుతూ సదరు  అధికారి కి దరఖాస్తు చేశాడు. ఆ దరఖాస్తుకు పూర్తి  సమాచారం ఇవ్వకపోవడం తో   దరఖాస్తు దారుడు  తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఫిర్యాదు చేశాడు.  దీనితో రాష్ట్ర  సమాచార  కమీషన్  సదరు అధికారికి  రెండు సార్లు షో కాజ్ నోటీసు ఇచ్చింది. కేసు విచారణకు వ్యక్తి గతంగా హాజరు కమ్మని  నోటీసు పంపింది. షో కాజ నోటీసు లకు స్పందించకుండా,  కేసు హియరింగ్ కూడ హాజరు కాక పోవడం తో తిరిగి మరో షో కాజు నోటీసు ఇస్తు సెక్షన్ 20 (1) ప్రకారంగా  చర్యలు ఎందుకు తీసుకోకూడదని వ్యక్తి గతంగా హాజరై వ్రాత పూర్వకంగా  సంజాయిషీ  ఇవ్వమని కోరింది.  సదరు అధికారి హాజరై వ్రాతపూర్వకంగా సంజాయిషి ఇచ్చాడు. అయన ఇచ్చిన సంజయిషి కి సంతృప్తి చెందని రాష్ట్ర సమాచార కమీషన్ 6000 రూపాయల జరిమానా విధిస్తూ ఆర్డర్ ఇచ్చింది.   ప్రతి నెల 1000 రూపాయలు ఆ అధికారి  డిసెంబర్ 2022 జీతం నుండి  2023 జనవరి నుండి  డ్రాయింగ్ ఆఫీసర్  6 నెలలు కట్ చేసి సమాచార హక్కు చట్టం  హెడ్స్ కు జమచేయాలని  పేర్కొంది.  ఇప్పుడు ఆ అధికారి నల్గొండ కాలుష్య నియంత్రణ మండలి  అసిస్టెంట్ ఎన్విరాన్మంటల్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం పై  ఆ కార్యాలయ డ్రాయింగ్ ఆఫీసర్ ను వివరాల కొరకు సంప్రదించగా ఆ విషయాలు నాకు తెలియవని అయన వివరణ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్