మహాశివరాత్రి ఉత్సవంలో ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలి - నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
మహాశివరాత్రి ఉత్సవంలో ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలి - నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నల్గొండ: పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో.. వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఛాయా సోమేశ్వరాలయం రోజు రోజుకు భక్తుల తాకిడి ఎక్కువవుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, ముఖ్యంగా బార్కేడింగ్ సానిటరింగ్, ట్రాఫిక్ అదుపు, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లపై ఎవరికి వారి బాధ్యతలు అప్పగించి నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు. 123 కోట్ల రూపాయలతో త్వరలో పనులు ప్రారంభం కాబోతున్న ఉదయ సముద్రం ట్యాంక్ బండ్, పచ్చల చాయా వెంకటేశ్వర ఆలయాల అభివృద్ధి శిల్పారామం, తీగల వంతెన, లతో ఈ ప్రాంతమంతా అత్యద్భుతంగా రూపుదిద్దుకోబోతుందని.. రానున్న రోజుల్లో ఛాయా సోమేశ్వరాలయం పూర్వ వైభవం సంతరించుకొన ఉందని కంచర్ల తెలియజేశారు...
ఈ సంవత్సరం నుండి.. పచ్చల, ఛాయా సోమేశ్వర నగరోత్సవం నిర్వహించుకోవాలని సూచించారు..
ఇందుకు ఈనెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి రామగిరి రామాలయం నుండి ఛాయా సోమేశ్వరాలయం వరకు విధ వివిధ కళా రీతులను ప్రదర్శిస్తూ... బ్రహ్మాండంగా నగరోత్సవాన్ని నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు .. ఇందుకు అయ్యే ఖర్చు తానే స్వయంగా భరిస్తానని వారు తెలియచేశారు. ఈ సమావేశంలో.. నల్గొండ ఆర్డీవో, డి.ఎస్.పి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ కేవీ రమణాచారి వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ ఆలయ చైర్మన్ గంట్ల అనంత రెడ్డి.. వివిధ శాఖలకు చెందిన అధికారులు.. సింగిల్ విండో చైర్మన్ నాగరత్నం రాజు,కౌన్సిలర్లు,ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గోగుల శ్రీనివాస్ యాదవ్, ఊట్కూరు వెంకటరెడ్డి,వట్టిపల్లి శ్రీనివాస్, యామా దయాకర్, పున్నా గణేష్ మారగోని గణేష్, నాయకులు.. బకరం వెంకన్న భువనగిరి దేవేందర్ సంధినేని జనార్దన్ రావు సూర మహేష్, చెన్నుగూడెం సర్పంచ్ జంగయ్య భక్తులు పాల్గొన్నారు
Comments
Post a Comment