కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు - వీరెల్లి


 కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల  ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు - వీరెల్లి

 నల్గొండ జిల్లా నకిరేకల్ అసెంబ్లీ కట్టంగూరు మండలం కట్టంగూరు గ్రామంలో శక్తి కేంద్రం 192 193 194 గల బూతులలో జరిగిన కార్నర్ మీటింగ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రబారి వీరెల్లి చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనీ, అదేవిధంగా యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో నిరుద్యోగ భృతి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేకపోయిందనీ, పేదవారికి రేషన్ కార్డులు అర్హులకు పెన్షన్లు అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అందని ద్రాక్ష పండుగ మిగిలిందనీ, రుణమాఫీ పేరుమీద రైతులను మోసం చేసి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. ఎన్నికల ముందు కేసీఆర్ హామీలను నమ్మొద్దని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని బిజెపిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు శక్తి కేంద్రం ఇన్చార్జి కోమటి భాస్కర్ , బూత్ అధ్యక్షులు అంజి బాబు శ్రీను అనిల్ మరియు మండల నాయకులు తండు సైదులు సాయి వెంకన్న మరియు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్