ఖరీదైన న్యాయవాదులను నియమించి ప్రజాధనాన్ని వృదా చేయవద్దు - ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్



 ఖరీదైన న్యాయవాదులను నియమించి ప్రజాధనాన్ని వృదా చేయవద్దు - ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్


హైదరాబాద్: హైకోర్టులో గాని సుప్రీమ్ కోర్టులో గాని ప్రైవేటు న్యాయవాదుల సేవలను ఉపయోగించకుండా, ఏ.జి.సేవలు వాడుకోవాలని, బేషజాలకు పోయి ప్రజాధనాన్ని వృధా చేయవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి వినతి పత్రం ఇచ్చింది.

హైకోర్టు జడ్జికి కావలసిన అర్హతలు ఉన్న వ్యక్తిని రాష్ట్ర గవర్నర్ గారు అడ్వకేట్ జనరల్ (ఏ.జి) గా నియమించాలని రాజ్యాంగం అనుకరణ 165 నిర్దేశిస్తుందని, అలాగే ప్రభుత్వానికి కావలసిన న్యాయ సహాయాన్ని సలహాలను అడ్వకేట్ జనరల్ అందించాలని రాజ్యాంగం నిర్దేశిస్తుందని,

తెలంగాణ రాష్ట్రంలో ఏ.జి.కి సహకారంగా అడిషనల్ ఏ.జి. కూడ నియమితులైనారని వినతి పత్రం లో పేర్కొన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. వీరికి కావలసిన సిబ్బంది, కార్యాలయం ఇతర సదుపాయాలు ఉన్నాయిని, ఏ.జి. కి ప్రతికేసులో హాజరుకు రూ// 10 వేలు చెల్లిస్తారని (ఒకరోజు 7 కేసులకు మించకుండా), ఈవిధంగా ఏ.జి. కి నెలకు 15 లక్షల వరకు చెల్లింపులు జరుగుతాయిని, అదేవిధంగా అడిషనల్ ఏ.జి. కి ప్రతి కేసు హాజరుకు రూ// 8500 (రోజుకు 7 కేసులకు మించకుండా) చెల్లిస్తారని, ఈవిధంగా అడిషనల్ ఏ.జి. కి నెలకు10 లక్షల రూపాయల వరకు చెల్లిస్తారని, ఇది కాకుండా ఏ.జి. కి సహాయ సహకారాలు అందించడానికి 35 మంది ప్రభుత్వ న్యాయవాదులు (జి.పి.లు) మరియు 11 మంది స్టాండింగ్ కౌనిల్స్ ఉన్నారని, దీనికి తోడు కార్యాలయ సిబ్బంది కార్యాలయం వాటిపై ఖర్చు కలిపి నెలకు రెండు కోట్ల వరకు ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. సుప్రీమ్ కోర్టు, ఎన్.జి.టి., జలసంఘం వంటి వాటి ముందు వాదనలకై స్టాండింగ్ కౌన్సిల్ ఉన్నదని, ఈయనకు 10 రకాల పద్దులతో సుమారు నెలకు 25 లక్షల దాక ఫీజు చెల్లించడం జరుగుతుందని, ప్రభుత్వ కేసులు కోర్టులలో వాదించడానికి ఏ.జి. మరియు ఇతర జి.పి.లు ఉన్నా సుప్రీమ్ కోర్టులో మళ్ళీ కేసులలో వాదించడానికి అడ్వకేట్లను నియమిస్తున్నారని, కొత్తగా ఢిల్లీ నుంచి ఖరీదైన న్యాయవాదులను రప్పించడంలో ఆంతర్యమేమిటి ని ఆ వినతి పత్రం లో ప్రశ్నిచింది. ఉదాహరణకు గవర్నర్ కు మరియు ముఖ్యమంత్రి గారికి అభిప్రాయ భేదాలతో రాష్ట్ర బడ్జెట్పై అనుమానాలు మొదలై దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందని, ఈ కేసు వాదనకై ఢిల్లీ నుంచి అతి ఖరీదైన న్యాయవాదిని రప్పించడం జరిగిందని. ఈ కేసు కోర్టు బయట పరిష్కారం కావడంతో ప్రభుత్వం కేసు వాపసు తీసుకుందని, స్థానికంగా ఉన్న ఏ.జి.ని కాదని ఢిల్లీ నుంచి ఖరీదైన న్యాయవాదిని పిలిపించుట ఏవిధంగాను సమర్థనీయం కాదని పేర్కొనది శాసనసభ్యుల కొనుగోలు కేసు మొయినాబాదు పోలీసు స్టేషన్లో (ఎఫ్.ఐ.ఆర్. నం. 455/2022) ద్వార నమోదుచేయబదిన ఈ కేసును ప్రభుత్వం ఒక ముఖ్యమైన కేసుగా పరిగణించి ప్రత్యేక విచారణబృందం (సిట్)ను ఏర్పాటు చేయడం జరిగిందని. సిట్ వారు విచారణ జరుపుతుండగానే కొందరు వ్యక్తులు

హైకోర్టును ఆశ్రయించి కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ (సి.బి.ఐ) ద్వార విచారణ జరిపించాలని కోరగా కోర్టు అందుకు ఒప్పుకొని సి.బి.ఐ. విచారణకు ఆదేశాలు ఇవ్వడం జరిగిడంతో అటు తరువాత ఈ కేసు ఎన్నో

మలుపులు తిరిగి ప్రస్థుతం సుప్రీమ్ కోర్టులో ఉందని, ఈ కేసు వాదనలకై రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన న్యాయవాదులను

నియమించిందని, సామాన్యుడికి ఈ కేసు పైన గాని ఎవరు

(సిట్/సి.బి.ఐ) కేసును విచారిస్తారని గాని ఏమీ ఆసక్తి లేదని నిజాలు నిగ్గు తేలితే చాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ

కేసును ఒక సవాలుగా తీసుకొని ప్రజాధనాన్ని వృధా చేస్తుందని. రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

చేసుకొనుటకు కూడ హైకోర్టు ఆర్డరు కావలసి రావడం రాష్ట్ర పాలన వ్యవస్థ యొక్క అసమర్థతకు అద్దం పడుతుందని, అయినదానికి, కానిదానికి గత 8 సంవత్సరములలో ప్రభుత్వ న్యాయవాదులను పక్కన పెట్టి కోట్లలలో ప్రజాధనాన్ని వృదాచేస్తుందని. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్.జి.టి. తన తీర్పులో తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా పనులు చేయుట ఒక అలవాటుగా మారిందని, ఉద్ధేశ్యపూర్వకంగా ఎన్.జి.టి. వారి ఆజ్ఞలు ఉల్లంఘించినందుకు తెలంగాణ రాష్ట్రంపై 920 కోట్లు జరిమానా విధించడం జరిగిందని తెలిపింది. హైకోర్టులో గాని సుప్రీమ్ కోర్టులో గాని ప్రైవేటు న్యాయవాదుల సేవలను ఉపయోగించకుండా, ఏ.జి. సేవలు వాడుకోవాలని, బేషజాలకు పోయి ప్రజాధనాన్ని వృధా చేయవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరింది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్