వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం


 వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం


నల్లగొండ, ఫిబ్రవరి 3 , జిల్లా కేంద్రంలోని వీటి కాలనీలో గల శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య, మంగళ వాయిద్యాలు మోగుతుండగా స్వామి వారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. అంతకుముందే స్వామి,అమ్మవార్లను పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి, రంగురంగుల పూలతో అలంకరించిన వేదిక పైన ఆసీనులను చేసి శాస్త్రోక్తంగా పుణ్యావాచనం, కంకణ ధారణ రక్షాబంధన్ ,పాదపక్షాళన, జీలకర్ర బెల్లం వంటి కళ్యాణ తంతును నడిపించారు. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య వేద పండితులు పవన్ శర్మ సాయి శర్మ ఆధ్వర్యంలో కల్యాణాన్ని జరిపించారు. అనంతరం తలంబ్రాలు ఘట్టం నిర్వహించారు. కళ్యాణ పీటల మీద భక్తులు పెద్ద సంఖ్యలో కూర్చున్నారు. చుట్టుపక్కల కాలనీలో చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించి పరవశించిపోయారు. దీంతో ఆలయమంతా భక్తుల సందడి కిటకిటలాడింది. విద్యుత్ దీపాలతో మనోహరంగా వెలిగింది. కళ్యాణ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను, అన్నదాన ప్రసాద వితరణ చేశారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్