ఇండ్లూరు బిజెపి కార్నర్ మీటింగు లో వీరెల్లి
ఇండ్లూరు బిజెపి కార్నర్ మీటింగు లో వీరెల్లి
ఈరోజు నల్గొండ జిల్లా నల్లగొండ అసెంబ్లీ తిప్పర్తి మండలం ఇండ్లురూ గ్రామంలో శక్తి కేంద్రం 271 272 గల బూతులలో కార్నర్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రబారి వీరెల్లి చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో నిరుద్యోగ భృతి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేకపోయిందనీ, పేదవారికి రేషన్ కార్డులు అర్హులకు పెన్షన్లు అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అందని ద్రాక్ష పండుగ మిగిలిందనీ, రుణమాఫీ పేరుమీద రైతులను మోసం చేసి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. చాలా మంది రైతులకు రైతుబంధు ఇవ్వకుండా రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారి, రైతుల రైతుల ఖాతాలను ఎన్ పి ఏ లుగా మార్చడం, అదేవిధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తానని మరొక్కసారి రైతులను మోసం చేసాడు కేసీఆర్ అని పేర్కొన్నారు. అమలు కాని హామీలు ఇస్తూ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందడని, దళిత బందు పేరా మరొక్కసారి దళితులను మోసం చేయడానికి ఎన్నో హామీలు ఇస్తున్నడని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందను, ఈ రాష్ట్రంలో కరోనా టీకా నుండి జాతీయ రహదారుల వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనీ తెలిపారు. మరుగుదొడ్ల కార్యక్రమాన్ని చేపట్టి మహిళల ఆత్మ అభిమానాన్ని నిలిపిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చి మహిళల వంటింట బాధలు తీర్చడం జరిగిందని, రైతులకు 6000 రూపాయలు ఇచ్చి పసల్ బీమా ఏర్పాటు చేసి ఎంఎస్పి ఇచ్చి వాళ్లకు భరోసాగా నిలబడిందనీ, ప్రపంచ దేశాలలో మన దేశం ఆర్థిక శక్తిగా ఐదవ దేశంగా తయారు చేసిన ఘనత నరేంద్ర మోడీ దీనిని, జి20 దేశాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశం భారతదేశం దానికి కారణం నరేంద్ర మోడీ ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడిగా నరేంద్ర మోడీ అవినీతి రహిత స్థిరమైన సమర్థవంతమైన పాలనను అందిస్తున్న వ్యక్తి అన్నారు లక్ష కోట్లు ఖర్చుపెట్టి తెలంగాణలో జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం జరిగిందనీ, వందే భారత్ రైళ్లు తెలంగాణకు ఇవ్వడం జరిగిందని, ఇంకా అనేక ప్రాజెక్టుల అభివృద్ధి విషయంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించి రైతుల అదృష్టంగా మార్చడం జరిగిందని, ప్రాన్స్ లాంటి దేశాలు బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు మోడీ ని భారతదేశాన్ని అభినందించక తప్పలేద ని అన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ హామీలను నమ్మొద్దని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని బిజెపిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. ఇండ్లురు శక్తి కేంద్రం ఇన్చార్జి మామిడి రాజు అధ్యక్షతన వహించారు 271 272 గల బూతులకు కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగులో బూత్ అధ్యక్షులు ప్రవీణు కోటేష్ మరియు మండల అధ్యక్షులు గుండా వినయ్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి వంగూరు రవి మరియు మామిడి మల్లమ్మ మరియు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు
Comments
Post a Comment