ఎన్టీఆర్ శ్రమశక్తి అవార్డు గ్రహీత కౌటికె విఠల్ కు అభినందన
ఎన్టీఆర్ శ్రమశక్తి అవార్డు గ్రహీత కౌటికె విఠల్ కు అభినందన
శృతి-లయ ఆర్ట్స్ అకాడమి, సీల్వేల్ కార్పోరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో కౌటికె విఠల్ కు ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ శ్రమశక్తి బిరుదు” మరియు “సిల్వర్ క్రౌన్" ప్రధానం చేసిన సందర్భంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వారు అభినందన సత్కారం చేశారు. సామాజి గూడ ప్రెస్స్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ గార్లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గల జీవిత బీమా ఏజంట్ల అందరిలో నెం. 1 స్థానాన్ని గత రెండు సంవత్సరాలుగా పొందుతున్న భారతీయ జీవిత బీమా సంస్థ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విఠల్ కు శృతి-లయ ఆర్ట్స్అకాడెమీ, సీల్వెల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కౌటికె విఠల్ కు ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ శ్రమశక్తి" బిరుదును, వెండి కిరీటాన్ని ప్రధానం చేశారని అన్నారు. విఠల్ తన జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని 23 వ యేట ప్రారంభించి యింతింతై వరుడింతై అన్నట్లు తన జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని నిజామాబాదులో ప్రారంభించి, ఈ రోజు హైదరాబాదులో స్థిరపడి, దేశంలోనే నెం. 1 స్థానాన్ని తెచ్చుకోవడం జీవిత బీమా రంగంలో అంతకు మించిన ప్రగతి మరొకటి లేదని చెప్పవచ్చ ని అన్నారు. దేశంలో నలుమూలల్లో వున్న ఏజెంట్లకు సలహాలు, సూచనలు, వ్యాపార మెళకువలు, తన అనుభవాలను పంచుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వామ్ సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు వూర బాబురావు, ప్రధాన కార్యదర్శి, పివి రమణయ్య, కోశాధకారిగా మనేపల్లి రామారావు, వామ్ గ్లోబల్ వామ్ ప్రధాన కార్యదర్శి పసుమర్తి మల్లిఖార్జున్, కోశాదికారి ఎల్వి కుమార్, గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ ఓ ఎస్ ఎస్ ప్రసాద్, తెలంగాణ అధ్యక్షులు గౌరిశెట్టి మునిందర్, ఏం ఏన్ అర్ గుప్త పలువురు వామ్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment