కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ త్వరగా పూర్తి చేయాలి - రైస్ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ త్వరగా పూర్తి చేయాలి - రైస్ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
నల్గొండ, ఫిబ్రవరి 7.యాసంగి 2022 - 23 కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ (సి.యం.అర్) త్వరగా పూర్తి చేయాలని రైస్ మిల్లర్ లను అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. మంగళ వారం నల్గొండ పట్టణం లోని రైస్ మిల్లు లను అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.వచ్చే పంట సీజన్ కు నిల్వ సామర్థ్యం ఏర్పాటు చేసేలా వానాకాలం సి.యం.అర్ వేగవంతం చేయాలని సూచించారు. యాసంగి సీజన్ మిగిలిన 25 శాతం సి.యం అర్ వెంటనే పూర్తి చేయాలని మిల్లర్ లను ఆదేశించారు.పౌర సరఫరాల డి.టి.లు సి.యం.అర్ పెండింగ్ మిల్లు లను ప్రతి రోజు సందర్శించాలని ఆదేశించారు.పోర్టిపైడ్ కర్నల్(బలవర్ధకమైన పోషకాలు కలిగిన పదార్థం) డిమాండ్ కనుగుణంగా సరఫరా చేయాలని పౌర సరఫరాల డి.యం.కు సూచించారు.అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు తదితరులు ఉన్నారు
Comments
Post a Comment