నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత


 నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత


ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రముఖ నటుడు సినీ హీరో అర్జున్ సర్జ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్జున్ దంపతులు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు.


ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ... చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు.


దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్