సమాచార భారతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా సోషల్ మీడియా సంగమం


 సమాచార భారతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా సోషల్ మీడియా సంగమం 


హైదరాబాద్: సమాచార భారతి ఆధ్వర్యంలో  ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబద్ లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్ధల ఆవరణంలో సర్దార్ పటేల్ హాల్ లో సోషల్ మీడియా సంగమం 5వ సంచిక వైభవోపేతంగా జరిగింది. సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి స్వాగతోపన్యాసంలో భారతీయ మూలాలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సోషల్ మీడియా సంగమం ద్వారా ఏ ఫలితాలు ఆశించామో ఆ దిశగానే ఈ సంచిక కూడా జరుగుతోందని తెలిపారు. మూడు అంశాలు ప్రాతిపదికగా సదస్సులు నిర్వహించారు. ఆత్మ నిర్భరత అంశంపై జి .ఎన్ . రావు, శ్రీమతి కాశీనాథుని శిరీష విలువైన విషయాలు తెలియజేశారు . ప్రాధాన్యత రంగాల్లో ఆత్మ నిర్భరత యొక్క ఆవశ్యకతని  జి .ఎన్ . రావు వివరిస్తూ .. భారతదేశం రక్షణ రంగంలో సాధించిన విషయాలను వివరంగా తెలియజేశారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరిశోధన చేసిన శ్రీమతి కాశీనాథుని శిరీష మాట్లాడుతూ సోషల్ మీడియాను అవసరమైన అంశాలలో ఎలా ఉపయోగించుకోవాలో , అనవసరమైన సమాచారాన్ని ఎలా నిరసించాలో వివరించారు. నారేటివ్ సదస్సులో  దేవగిరి ప్రాంతంలోని బంజారా కుంభమేళా నిర్వహణ ఏ విధంగా బంజారాలను ఐక్యం చేసిందో భారతీయ  ధార్మిక మూలాలను ఎలా కలిపిందో కల్పేష్ వివరించారు. పాంచజన్య పత్రిక సంపాదకులు హితేష్ మాట్లాడుతూ .. వార్తా కథనాలతో అనేక కోణాల గురించి వివరించారు. తప్పుడు వార్తలను ఎలా ఎదుర్కోవాలో , సరైన వార్తలను ఎలా అర్థం చేసుకోవాలో వివరించారు. మూడవ సదస్సులో రాజగోపాల్ గారు సమాచార భారతి యొక్క వార్త విభాగాలైన vsktelangana.org , నిజం మొదలైన ఇన్ఫర్మేషన్ బేస్ గురించి వివరించారు. ముగింపు సమావేశంలో మాట్లాడిన క్షేత్ర ప్రచార ప్రముఖ్ ఆయుష్ సమాజం ముఖ్యమైన సంస్కృతి స్వరూపమనీ , ప్రపంచం యావత్తు భారతదేశ సంస్కృతి యొక్క గొప్పదనాన్ని గౌరవించిందని, విశ్వ వ్యాప్తమైన ఆలోచనకు భారతీయ జ్ఞానధార తగిన బలాన్ని అందిస్తోందని కనుక విషయాన్నీ గమనించి సోషల్ మీడియాలో తగిన జాగ్రత్తలో  ఉండాలని కోరారు. దాదాపు 200 మందికి పైగా యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తగిన దిశానిర్దేశం పొందారు. ఈ సదస్సును ప్రదీప్,  అమర్నాథ్ రెడ్డి గారు , సురేందర్ గారు నిర్వహించారు. రమేష్ వందన సమర్పణతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. 



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్