కెసిఆర్ పాలనలో అప్పు కొండంత అభివృద్ధి శూన్యం - గంగిడి మనోహర్ రెడ్డి
*కెసిఆర్ పాలనలో అప్పు కొండంత అభివృద్ధి శూన్యం బడ్జెట్లో కేటాయింపులు తప్ప నిధుల విడుదల, అభివృద్ధి లేదు-బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి*
నల్గొండ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కెసిఆర్ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అప్పు కొండంత అభివృద్ధి శూన్యంగా మారిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని చర్లపల్లిలో బిజెపి కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరం ఉద్యమంలో పాల్గొన్నామని వచ్చిన తెలంగాణ లో మాత్రం ప్రజలను నిరుద్యోగులను ఉద్యోగులను యువకులను విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని, మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు. జిల్లా కేంద్రంలో 700 కోట్లతో ఐటి హబ్, రోడ్ల విస్తరణ అని చెప్పి కమిషన్లు తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో హడావిడి శిలాఫలకాలతో రాజుల సొమ్ము రాళ్లపాళ్ల మాదిరిగా అధికారులు పనిచేస్తున్నారు. విద్యా వైద్యం ఉద్యోగ ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తుందన్నారు. రైతులకు కేవలం రైతుబంధు ఇచ్చి రైతుల సబ్సిడీలు రుణమాఫీని ఎత్తివేసారని ఆరోపించారు. ఎనిమిదేళ్ల కాలంలో 8 బడ్జెట్లలో నిధులు విడుదల చేసింది ఎంత ఖర్చు చేసిందెంత తెలంగాణ బాగుపడ్డది ఎంతో ప్రభుత్వం తెలపాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన సమయంలో రాష్ట్రానికి 60 వేల కోట్లు అప్పు ఉంటే ప్రస్తుతం ఐదు లక్షల కోట్లు చేరిందన్నారు. పదవ తేదీ దాటిన ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని ఆరోపించారు. వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు ఇచ్చి లిక్కర్ పైన వేలకోట్ల ఆలయం సమకూరుస్తున్నారని పేదలను చేసి పుట్టగొడుతున్నారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తే ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు డోల్లతను బయటపడుతుందని పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. దేశంలో 80 లక్షల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నదంతా కేంద్ర ప్రభుత్వానిది అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అవినీతి మాటల ప్రభుత్వమని ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతో పాటు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్, పోతెపాక సాంబయ్య, నాగం వర్షిత్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు మొరిషెట్టి నాగేశ్వరరావు, దాయం భూపాల్ రెడ్డి, నీరజ, కాశమ్మ, ఆవుల మధు, ఏరుకొండ హరి . శక్తి కేంద్ర ఇంచార్జ్ బద్దం నగేష్, గురిజా సైదులు,సుంకరబోయిన శ్రీనివాస్, కటకం శ్రీధర్, ఏర్పుల గణేష్, రామకృష్ణ, రాపోలు భాస్కర్,విద్యాసాగర్, రాజు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది.
Comments
Post a Comment