బిజెపి నాయకులపై దాడులకు పాల్పడ్డ గూండాలను అరెస్టు చేయాలి - బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల డిమాండ్
బిజెపి నాయకులపై దాడులకు పాల్పడ్డ గూండాలను అరెస్టు చేయాలి - బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల డిమాండ్
నల్లగొండ పట్టణంలో గురువారం సాయంత్రం ప్రజా గోస బీజేపీ బరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ విజయవంతం అవడంతో బీజేపీ నాయకుల పై అధికార పార్టీ భౌతికంగా దాడులకు పాల్పడ్డా గూండాలను అరెస్టు చేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. న పట్టణంలోని బొట్టుగుడ ప్రాంతంలో కార్నర్ మీటింగ్ జరుగుతున్న సమయంలో కొంత మంది గుండాలు బీజేపీ సమావేశంలో పాల్గొంటున్న డాక్టర్ నాగం వర్షిత రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలపై,నాయకుల పై దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యం పై దాడిగా భావిస్తున్నామనీ, ఇంతవరకు పట్టణంలో కనీసం ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వని అధికార పార్టీ నాయకులు బీజేపీ సభ లపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే బీజేపీ నాయకుల పై దాడి చేసిన గూండాలను పోలీస్ శాఖ అరెస్ట్. చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని బీజేపీ హెచ్చరిస్తుందని తెలిపారు .తాటాకు చప్పుళ్లకు బీజేపీ బెదరదని, నక్సలైట్ లకు ,ఇస్లామిక్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ పార్టీకి వీధి గూండాలు ఒక లెక్క కాదని ,బీజేపీ సభలకు అడ్డు వస్తే తగిన బుద్ది బీజేపీ కార్యకర్తలు చెబుతారని హెచ్చరించారు
Comments
Post a Comment