బి ఆర్ యస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్ట్రీట్ కార్నర్ మీటింగులు - బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి
బి ఆర్ యస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్ట్రీట్ కార్నర్ మీటింగులు - బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి
నల్గొండ: భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఆరు వందల శక్తి కేంద్రాల పరిధిలో స్ట్రీట్ కార్నర్ సభలు నిర్వహిస్తున్నామని నల్గొండ బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీదర్ రెడ్డీ ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన బీ ఆర్ యస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది ఆని తెలిపారు. తెలంగాణ సాధించుకుంటే బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి నేడు అప్పుల తెలంగాణ గా మార్చారు అని అయన ఎద్దేవ చేశారు. రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని శక్తి కేంద్రాల పరిధిలో వీదిసభలు నిర్వహించి బీ ఆర్ యస్ పార్టీ వైఫల్యాలను ఎండగడ్తమన్నారు. మోసపూరితమైన కెసిఆర్ మాటలను ప్రజలు నమ్మేలా లేరని చెప్పారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని చెప్పారు..
Comments
Post a Comment