Posts

Showing posts from March, 2023

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

Image
  ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి 10వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు దిశ, సారంగాపూర్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి ఏసీబీకి చిక్కింది. రూ.10వేల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లిం చడానికి సర్పంచ్ భర్త నుంచి విజయలక్ష్మి రూ. 10వేలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో శుక్ర వారం సర్పంచ్ భర్త నుంచి లంచం తీసుకుంటుం డగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.

50. వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డి ఈ ఓ

Image
  50. వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి  డి ఈ ఓ  సంగారెడ్డి జిల్లా : ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి డి ఈ ఓ 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సంగారెడ్డి డి ఈ ఓ రాజేష్ తో పాటు రామకృష్ణ అనే అసిస్టెంట్. ప్రైవేట్ స్కూలుకు ఎన్ఓసి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఈ అధికారులు

తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టిన కేసీఆర్ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్

Image
 తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టిన కేసీఆర్ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్   నల్గొడ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)* లో పేపర్ లీక్ మరియు బాధ్యులను కఠినంగా శిక్షించాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని,TSPSC చైర్మన్ సెక్రటరీ లను పదవి నుండి తొలగించాలని,IT మినిస్టర్ KTR ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో నిరసన దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టి, తన ఇంటికే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పుత్రరత్నాలకు, బంధువులకు ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేశారని, ప్రభుత్వ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువతీ, యువకుల జీవితాలను ఆగం చేశారని అన్నారు. గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్న కొద్దీ TSPSC స్కాం అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోందని, బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప...

గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) అధ్యక్షుడిగా గురుప్రసాద్

Image
 గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) అధ్యక్షుడిగా నటుకుల గురుప్రసాద్ ను నియమించిన గ్లోబల్ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ నియమించారు. తనను నియమించిన టంగుటూరి రామకృష్ణ కు కృతజ్ఞతలు తెలిపిన గురుప్రసాద్. పదవికి శాయశక్తులా కృషి చేసి న్యాయం చేకుర్చుతానని గురుప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు.

విస్తృతంగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు - హైదరాబాద్ జిల్లా ఇంచార్జి డా. దాసోజు శ్రావణ్

Image
  విస్తృతంగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు - హైదరాబాద్ జిల్లా ఇంచార్జి డా. దాసోజు శ్రావణ్ హైదరాబాద్ , మార్చి 18 : హైదరాబాద్ లో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు అట్టహాసంగా జరిపేందుకు ప్రణాలిక సిద్ధం చేసారు. ఈ క్రమంలో ఈరోజు డా. దాసోజు శ్రావణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆత్మీయ సమ్మేళనాలు సంబదించిన విశేషాలను మీడియా కు వివరించారు. పార్టీ శ్రేణులు అందర్నీ ఏకం చేసేలా విస్తృతంగా చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలు, డా. బి అర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, సెక్రటేరియట్ ప్రారంభోత్సవం, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, సభ్యత్వ నమోదు మరియు బిఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగం కార్యక్రమాలను రానున్న మూడు నాలుగు నెలలపాటు పార్టీ విస్తృతంగా ఎలా చేపట్టాలనే దానిపై ఈరోజు సమావేశమయ్యారు. మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ , హోమ్ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నేతృత్వం లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో MLA కాలేరు వెంకటేష్, మేయర్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి , ఎమ్మెల్సీ MS ప్రభాకర్, శ్రీమతి వాణి దేవి, గజ్జల నగేష్ కట్టెల శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, విప్లవ్, మాజీ ఎమ్మెల్సీ శ...

TSPSC ముట్టడి- బండి సంజయ్ ను అరెస్ట్

Image
  TSPSC ముట్టడి- బండి సంజయ్ ను అరెస్ట్  హైదరాబాద్:  • బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు • బండి సంజయ్ తోపాటు ఈటల రాజేందర్ ను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలోకి ఎక్కించిన పోలీసులు • పోలీస్ వాహనాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్న కార్యకర్తలు... • అడ్డుకున్న కార్యకర్తలందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు...

నల్గొండ వీటి కాలనీలో కుక్కల కుక్కల స్వైర విహారం

Image
  నల్గొండ వీటి కాలనీలో కుక్కల కుక్కల స్వైర విహారం నల్గొండ:  సొంత ఇంటి ముందు నిలబడి వున్న యజమానిని కరిచి పారిపోయిన వీది కుక్క.  వరసగా రెండో రోజు నల్గొండ లోని  V T Colony లో జరుగుతున్న సంఘటనలకు కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.   వేంకటేశ్వరకాలనీ లో కుక్కలు స్వైర విహారం చేస్తన్నాయని,  కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని,  దీంతో పాదచారులై వెళ్ళే పిల్లలు, పెద్దల వెంట కుక్కలు పడుతుండటం చేత ఒంటరిగా రోడ్లవెంట వెళ్ళటానికి భయపడుతున్నారని,కోతులు రోజుల తరబడి ఇళ్ళపై ఉండి రోజువారీ కార్యక్రమాలకి ఇబ్బంది కలిగిస్తున్నాయని,   వేంకటేశ్వరకాలనీవాసులకు కుక్కల, కోతుల బెడద తప్పించగలరని కోరుతూ మునిసిపల్ కమీషనర్ కు మొరపెట్టుకున్న కాలనీ వాసులు                  

రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులుగా వీరెల్లి

Image
రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులుగా వీరెల్లి నల్గొండ: రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులుగా సీనియర్ నాయకుడు వీరెల్లి చంద్రశేఖర్ ను రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నియమించారు. ఈ సందర్భంగా వీరెల్లి మాట్లాడుతూ నా పై నమ్మకమువుంచి నియమించి నందులకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి, జిల్లా, రాష్ట్ర స్థాయి లో పార్టీ అభివృద్ధికి పాటుపడుతనని తెలిపారు. నా నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ శాసనమండలి నాయకుడు రామచంద్ర రావు, మనోహర్ రెడ్డి , ఆర్ ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి లకు ధన్యవాదములు తెలిపారు 

స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం చీరల పంపిణీ

Image
 స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం చీరల పంపిణీ నల్గొండ: సీనియర్ జర్నిలిస్టు కోటగిరి దైవాదీనం సతీమణి  శ్రీమతి స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా Vc KCGF Nalgonda సహకారంతో వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి  చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కుమారుడు రామకృష్ణ కోడలు రమ్య శాంతి కోరిక మేరకు చీరలు పంపిణీ చేశారు.

నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు..

Image
  నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు.. జిల్లా ఎస్పీ కె. అపూర్వ రావు ఐ.పి.యస్.                నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లు మార్చడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అధికారిక ఫోన్ నెంబర్లు ఇకపై పనిచేయవని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, నూతనంగా కేటాయించిన ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటారని ఎస్పీ గారు పేర్కొన్నారు.  జిల్లాలోని పోలీసు అధికారులు డిఎస్పీ, సీఐలు, ఎస్సైలతో పాటు ఇతర పోలీసు అధికారులకు నూతన నెంబర్లు అందించినట్లు తెలిపారు. *జిల్లా పోలీసు అధికారుల మార్పు చేసిన అధికారిక ఫోన్ నెంబర్లు:* *1) జిల్లా యస్.పి* 8712670200  *2) అడిషనల్ ఎస్పీ* 8712670201  *3) అడిషనల్ ఎస్పీ ఆపరేషన్* 8712670202 4) *యస్.బి డిఎస్పీ* 8712670204  *5) నల్గొండ డిఎస్పీ* 8712670205  *6) మిర్యాలగూడ డిఎస్పీ* 8712670206  *7) దేవరకొండ డిఎస్పీ* 8712670207  *8) డి.సి.ఆర్.బి డిఎస్పీ*  8712670208  *9) సి.సి.యస్.డిఎస్పీ* 87126702...

బుడ్డ అర్జున్ రెడ్డి... వీరంగం...మింగుత అంటుండు...

Image
  బుడ్డ అర్జున్ రెడ్డి... వీరంగం...మింగుత అంటుండు... కాల మింగుత అంటుండు... కొడ్తవా అట్లా సూస్తున్నవ్ అట వాయ్యో వామ్మో....పోలీసులకు భయపడని వాడు టీచర్లకు ఏం భయపడతడు రాష్ట్రంలో రాజకీయ నాయకుల నుంచి బాగా ఇన్స్పైర్ అవుతున్నట్లు వున్నారు వీళ్ళు కూడా

లోకల్ పత్రికల ఎడిటర్లు కు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అల్లం కు వినతి పత్రం

Image
  లోకల్ పత్రికల ఎడిటర్లు కు ప్రభుత్వము ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అల్లం కు వినతి పత్రం హైదరాబాద్: లోకల్ పత్రికల ఎడిటర్లు కు ప్రభుత్వము ఇండ్ల స్థలాలు ఇప్పించుట మరియు తదితర సమస్యల పరిష్కారం గురించి అన్ని లోకల్ పత్రికల తరపున తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కు వినతి పత్రం సమర్పించారు. గత 20 ఏండ్లు గా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ సమస్య పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం, తమరు ఒక అడుగు ముందుకు వేసి వివిధ యూనియన్ల, మీడియా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని. తమరి సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ప్రధాన సమస్య అయిన ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షిస్తున్నానని ఆ వినతి పత్రం లో కోరారు. చిన్న/లోకల్ పత్రికలను ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ సమస్యలు ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ముందుకు నడుస్తున్న చిన్న లోకల్ పత్రికల ఎడిటర్ల అందరి తరపున విన్నవించారు. చిన్న లోకల్ పత్రికల ఎడిటర్లు గా ఉన్న వారందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించాలను, చిన్న పత్రికల ఎడిటర్లను ప్రత్యేక కేటగిరీ గా గుర్తించి PF/ESI నుంచి మినహ...