లోకల్ పత్రికల ఎడిటర్లు కు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అల్లం కు వినతి పత్రం


  లోకల్ పత్రికల ఎడిటర్లు కు ప్రభుత్వము ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అల్లం కు వినతి పత్రం

హైదరాబాద్: లోకల్ పత్రికల ఎడిటర్లు కు ప్రభుత్వము ఇండ్ల స్థలాలు ఇప్పించుట మరియు తదితర సమస్యల

పరిష్కారం గురించి అన్ని లోకల్ పత్రికల తరపున తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కు వినతి పత్రం సమర్పించారు. గత 20 ఏండ్లు గా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీ సమస్య పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం, తమరు ఒక అడుగు ముందుకు వేసి వివిధ యూనియన్ల, మీడియా ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని. తమరి సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ప్రధాన సమస్య అయిన ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షిస్తున్నానని ఆ వినతి పత్రం లో కోరారు.

చిన్న/లోకల్ పత్రికలను ఏర్పాటు చేసుకుని ప్రాంతీయ సమస్యలు ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ప్రజలకు

ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ ముందుకు నడుస్తున్న చిన్న లోకల్ పత్రికల ఎడిటర్ల అందరి తరపున విన్నవించారు. చిన్న లోకల్ పత్రికల ఎడిటర్లు గా ఉన్న వారందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించాలను, చిన్న పత్రికల ఎడిటర్లను ప్రత్యేక కేటగిరీ గా గుర్తించి PF/ESI నుంచి మినహాయింపు ఇవ్వాలని. ఎడిటర్లు అందరికీ హైదరాబాద్ లోనే ఇండ్లస్థలాలు ఇప్పించాలని, చిన్న పత్రికలతో పాటు వార, మాసపత్రికలలో అర్హులైన అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మనవి చేశారు. చిన్న పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ESI /PF నుంచి మినహాయింపు ఇచ్చి, ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అనేక మంది అనేక పెద్ద పత్రికలలో, ఛానెళ్లలో పనిచేసి తమ సీనియారిటీ అనుభవంతో అనేక ఇబ్బందులు పడుతు తమ ప్రత్యేకతను చాటుతూ చిన్న పత్రికలను విజయవంతంగా నడుపుతున్నారని,. వారికి ప్రభుత్వం నుంచి అడ్వర్టైజ్ రూపంలో మరింత సహయ సహకారాలు ఇప్పించాలని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు ఎండి యూసఫ్ బాబు, భీమగాని మహేష్ గౌడ్, మాతంగి దాస్ ఎ.శ్రీనివాస్ ,తాటికొండ కృష్ణ,వై.ఎల్.ఎచ్. అశోక్, డి.బాలకృష్ణ, అప్రోజ్ ఖురేషి, హుస్సేన్ ఎక్భాల్, ఎం.డి. మక్సూద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్