విస్తృతంగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు - హైదరాబాద్ జిల్లా ఇంచార్జి డా. దాసోజు శ్రావణ్
విస్తృతంగా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు - హైదరాబాద్ జిల్లా ఇంచార్జి డా. దాసోజు శ్రావణ్
హైదరాబాద్ , మార్చి 18 : హైదరాబాద్ లో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు అట్టహాసంగా జరిపేందుకు ప్రణాలిక సిద్ధం చేసారు. ఈ క్రమంలో ఈరోజు డా. దాసోజు శ్రావణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆత్మీయ సమ్మేళనాలు సంబదించిన విశేషాలను మీడియా కు వివరించారు. పార్టీ శ్రేణులు అందర్నీ ఏకం చేసేలా విస్తృతంగా చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలు, డా. బి అర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, సెక్రటేరియట్ ప్రారంభోత్సవం, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, సభ్యత్వ నమోదు మరియు బిఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగం కార్యక్రమాలను రానున్న మూడు నాలుగు నెలలపాటు పార్టీ విస్తృతంగా ఎలా చేపట్టాలనే దానిపై ఈరోజు సమావేశమయ్యారు. మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ , హోమ్ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ నేతృత్వం లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో MLA కాలేరు వెంకటేష్, మేయర్ విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి , ఎమ్మెల్సీ MS ప్రభాకర్, శ్రీమతి వాణి దేవి, గజ్జల నగేష్ కట్టెల శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, విప్లవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సాయి కిరణ్ యాదవ్, విపిన్, అజాం అలీ పాల్గొన్నట్లు డా. దాసోజు శ్రావణ్ గారు తెలియజేసారు.
Comments
Post a Comment