తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టిన కేసీఆర్ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టిన కేసీఆర్ - బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్
నల్గొడ: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)* లో పేపర్ లీక్ మరియు బాధ్యులను కఠినంగా శిక్షించాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని,TSPSC చైర్మన్ సెక్రటరీ లను పదవి నుండి తొలగించాలని,IT మినిస్టర్ KTR ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో నిరసన దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టి, తన ఇంటికే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పుత్రరత్నాలకు, బంధువులకు ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేశారని, ప్రభుత్వ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువతీ, యువకుల జీవితాలను ఆగం చేశారని అన్నారు. గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్న కొద్దీ TSPSC స్కాం అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోందని, బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై చేసినట్టు తెలుస్తోందని, జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా మెయిన్స్ కు అర్హత సాధించారని పేర్కొన్నారు. ఒక చిన్న గ్రామం నుంచే 6 గురు క్వాలిఫై అయ్యారని, వీళ్లంతా ప్రతిభావంతులు అనుకుంటే పొరబాటేనని, బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లు కావడం వీళ్లకున్న ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్ అని అన్నారు. నలుగురు బీఆర్ఎస్ సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతో పాటు ఒక జడ్పీటీసీ బాడీగార్డ్ కొడుకు క్వాలిఫై అయ్యారనీ, ఒక సర్పంచ్ కుమారుడికి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన క్వాలిఫై చేశారని, ఇదంతా కేసీఆర్ కొడుకు కనుసన్నల్లోనే జరిగిందని విమర్శించారు. ఇందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం ఉందని అన్నారు. నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అనర్హులకు ఉద్యోగాలిప్పిస్తున్న కేసీఆర్ కొడుకును తక్షణమే కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఆయన నియమించిన సిట్ తో నిష్పక్షపాత విచారణ ఎలా సాధ్యం ? అని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు అభ్యంతరం ఎందుకు అని, నయీం డైరీ, టాలీవుడ్ డ్రగ్స్ కేసు, మియాపూర్ ల్యాండ్ కేసు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సూసైడ్ కేసు తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్ కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. లక్షలాది మంది నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ ప్రభుత్వం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలనీ, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాల పై, కేసీఆర్ కొడుకు నిర్వాకంపై మరిన్ని వాస్తవాలను అతి త్వరలోనే బయటపెడతామని, అసలైన దోషులను తెలంగాణ సమాజం ముందు నిలబెడుతాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, పార్లమెంట్ కన్వీనర్ బండార్ ప్రసాద్ ,దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతేపాక సాంబయ్య ,జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి గారు, జిల్లా పార్టీ నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు,మండల అధ్యక్షులు, ప్రతినిధులు,శక్తి కేంద్రం ఇంచార్జీలు, సహ ఇన్చార్జులు,మహిళా మోర్చా నాయకులు,కార్యకర్తలు, టీఎస్పీఎస్ బాధితులు పాల్గొన్నారు.
Comments
Post a Comment