చర్లపల్లి లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, 132 వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి
చర్లపల్లి లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, 132 వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ పట్టణ బిజెపి ఉపాధ్యక్షుడు బద్దం నాగేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కిందని సగర్వంగా ప్రజానీకానికి తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపాలిటీ కార్మికులచే కొబ్బరికాయ కొట్టించారు. అదేవిధంగా ప్రజలకు మున్సిపాలిటీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమానికి బిజెపి ఓబీసీ నల్లగొండ పట్టణ ఉపాధ్యక్షుడు సైదులు గౌడ్, ఏర్పుల వెంకన్న, జి నాగేష్ గౌడు, కే రామకృష్ణ నేత, రాములు మధు కత్తుల కృష్ణ నాగరాజు గణేషు శీను మున్సిపాలిటీ కార్మికులు, బిజెపి కార్యకర్తలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
Comments
Post a Comment