చంద్రబోసుకు పుట్టిన గడ్డపై ఆత్మీయ సత్కారం
చంద్రబోసుకు పుట్టిన గడ్డపై ఆత్మీయ సత్కారం
ఆస్కార్ అవార్డు పొందిన తెలంగాణా బిడ్డ, సినీ గేయ రచయిత చంద్రబోసుకు పుట్టిన గడ్డపై ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేయడమైనది.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ఈ నెల 2న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల మైదానంలో జరుప తలపెట్టామని చల్లగరిగె గ్రామస్తులు తెలిపారు. ముందుగా చంద్రబోసు ఇంటి పక్కనే ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వేద ఆశీర్వచనం ఉంటుందని, ఆ తర్వాత అక్కడి నుంచి పాఠశాల మైదానం వరకు భారీ ర్యాలీగా చేరుకుంటారుని, వేదికపై గ్రామస్తులు, బాల్యమిత్రులు, అభిమాన సంఘాల వారు సత్కరిస్తారని తెలిపారు. . ఆ తర్వాత చంద్రబోసు ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమం గ్రామస్తులు, బాల్యమిత్రుల ఆధ్వర్యంలో జరుగుతుందని, చుట్టూ ఉన్న గ్రామాల నుంచి ప్రజలు, చంద్రబోసు అభిమానులు తరలివస్తున్నారని తెలిపారు.
Comments
Post a Comment