ఏకగ్రీవంగా ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ ఎన్నిక


 

ఏకగ్రీవంగా ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్  ఎన్నిక


హైదరాబాద్ , ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గుప్త మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గార్ల అధ్యక్షత న జరిగిన సమావేశంలో ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ సభ్యులు ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతారు.ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ గా గంజి రాజమౌళి గుప్త గారిని, జనరల్ సెక్రటరీ గా బొగ్గారపు దయానంద్ గారిని, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ,గారిని ఆర్గనైసింగ్ సెక్రటరీ గా ఎన్నుకున్నారు.ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ ట్రెసరర్ గా గెల్లి ప్రభాకర్ గారిని,వైస్ చైర్మన్ గా సుబ్బారాయుడు, వైస్ ప్రెసిడెంట్ గా వాసు, రాఘవేంద్ర, అడ్వైసర్ గా గౌరు శ్రీనివాస్, గెల్లి రమేష్, గార్లని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముషీరాబాద్ వాసవి హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్త గారు మాట్లాడుతూ..నూతనంగా నియమింపబడిన కమిటీ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.💐

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్