ఏసీబీకి వలలో సబ్ రిజిస్ట్రార్
అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి అధికారిని పట్టుపడింది. మంగళవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ల కోసం పూదరి శ్రీనివాస్ నుండి 60వేల రూపాయలు తీసుకుంటుండగా పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసులను ఏసీబీ డీఎస్పీ భద్ర ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో సైతం డాక్యుమెంట్ల కోసం నగదు తీసుకొని మరోసారి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా ఈరోజు పట్టుకున్నారు.
Comments
Post a Comment