ఓబీసీ మోర్చా అధ్వర్యంలో. ఇంటి ఇంటి కి మోడీ బిసిలకు చేకూర్చిన పథకాలు


 గూడచారి న్యూస్ చిట్యాల= నకిరేకల్ నియోజకవర్గo చిట్యాల మండలం వెంబాయి గ్రామంలో పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా భరోసా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బిజేపి ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండ భవాని ప్రసాద్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు పాల్గొని మాట్లాడారు పల్లె పల్లెకు ఓబీసీ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు చేకూర్చిన ప్రయోజనాలు గురించి తెలియజేయడం జరిగింది. వెంబాయ్ గ్రామంలో ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బీసీలకు ప్రవేశపెట్టిన పథకాలు లబ్ధి పొందిన ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారని తెలియజేస్తూ వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ 102 వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ కి రాజ్యాంగ హోదాను అందిస్తుందన్నారు, 105వ రాజ్యాంగ సవరణ చట్టం, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారి రాష్ట్రాల ఓబిసి జాబితాను రూపొందించే హక్కు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ  అని తెలియజేశారు, ఓ బి సి ఆదాయ క్రిమిలేయర్ సవరణ 2017లో ఓబీసీ క్రిమిలేయర్ ఆదాయాన్ని రూపాయలు ఆరు లక్షల నుండి 8 లక్షలకు పెంచారన్నారు, 27 ఓబిసి మంత్రులు మొదటిసారి కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించారని, PSU లో ఓ బీసీలకు రిజర్వేషన్లు ఓబీసీ వర్గాల సంక్షేమం సాధికారతకు సంబంధించి వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని అవకాశాలను ప్రయత్నిస్తుందన్నారు, సుపరిపాలన జనరల్ కేటగిరిలో అర్హత సాధించిన అభ్యర్థులను ఓబీసీ కోటాలో పరిగణించే తప్పుడు విధానాన్ని రద్దుచేసి జనరల్ కేటగిరీలో అర్హత సాధించిన ఓబీసీ అభ్యర్థిని జనరల్ అభ్యర్థిగా పరిగణిస్తారు అని తెలియజేశారు, ఓబిసి విద్యార్థులకు సైనిక్ నవోదయ మరియు కేంద్రీయ విద్యాలయాల్లో రిజర్వేషన్లు, ఓబిసి విద్యార్థులకు స్కాలర్ షిప్స్, ఓబీసీల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ అందిస్తుందన్నారు, ఓ బి సి విద్యార్థుల కోసం జేఆర్ఎఫ్ స్థాయి జాతీయ ఫెలోషిప్, డా. బి.ఆర్. అంబేద్కర్ పథకం కింద విదేశీ చదువుల కోసం విద్య రుణాలు తీసుకునే ఓబీసీ విద్యార్థులకు వడ్డీ రాయితీని నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది దాని బడ్జెట్ కేటాయింపులను పెంచిందన్నారు, నీట్ రిజర్వేషన్, కొత్త విద్యా విధానం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్, పోషన్ అభియాన్ లేదా జాతీయ పోషకాహార మిషన్ ను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు, నేషనల్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓబీసీల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సబ్ వెన్షన్ స్కీమ్ , ఈపీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన వంటి ఎన్నో ప్రయోజనకర పథకాలను ఓబీసీలకు అందజేస్తున్న ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలుస్తుంది అన్నారు, కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో బీసీలను 9 ఏళ్లలో అన్ని రంగాల్లో అణచివేసింది అన్నారు. రాజకీయంగా, ఆర్థికపరంగా, విద్యాపరంగా, సామాజిక న్యాయం పరంగా, ఉద్యోగ, ఉపాధి పరంగా, ఇలా అన్ని విధాలుగా వివక్షకు గురవుతున్న బీసీ సామాజిక వర్గం ఒక్కసారి ఆలోచన చేయాలని కేసిఆర్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా బిజెపి దేశానికి ఒక బీసీ నాయకుడిని ప్రధానిగా చేసిందన్నారు, రాష్ట్రంలో బీసీలకు సముచిత నాయకత్వం ఇచ్చింది భారతీయ జనతా పార్టీనే తెలంగాణ బీసీల ఆశలు, ఆశయాలు, రాజ్యాధికారం, ఆత్మ గౌరవాన్ని కాపాడాలన్న అది డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అధికారాన్ని ఇవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మద్దతు పలకాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నకిరేకల్ నియోజకవర్గం కన్వీనర్ గరిషే రవికాంత్,ఓబిసి చిట్యాల మండల కోఆర్డినేటర్ గుండెబోయిన నరసింహ, బూత్ కమిటీ అధ్యక్షులు సిద్ధ గాని అశోక్, పామనగుండ్ల వెంకన్న, గురిజే వెంకన్న, లింగస్వామి, మల్లేష్, రమేష్, శ్రీశైలం, లింగయ్య, నరసింహ, వెంకన్న, అద్దెల కృష్ణారెడ్డి, మహేష్ , పవన్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్