*చిన్నపత్రికలకు డిస్ప్లే కలర్ ప్రకటనలు ఇవ్వాలి*
*చిన్నపత్రికలకు డిస్ప్లే కలర్ ప్రకటనలు ఇవ్వాలి*
హైదరాబాద్:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈనెల 14 న సమాచార శాఖ తరపున మంజూరు చేసిన ప్రకటనల విషయంలో చిన్న పత్రికలపట్ల వివక్ష చూపించింది. సమాచార శాఖ కక్షపూరితంగా వ్యవహరించి కేవలం బ్లాక్ అండ్ వైట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ప్రాంతీయ పత్రికల ఎడిటర్లు ఈరోజు మాసాబ్ ట్యాంక్ లోని సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో ఆందోళన చేశారు. కార్యాలయం ముందు బైఠాయించారు. సమాచార శాఖ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరకు డైరెక్టర్ పిలవడంతో ఆయనతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోరుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది. తెలంగాణ చిన్న తరహా దిన మాస పత్రికల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది పెండింగ్లో ఉన్న చిన్న పత్రికల సమస్యలను పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం రోజు మా పత్రికలకు ఇవ్వకపోవడం అన్యాయమని సదరు వినతి పత్రంలో జాయింట్ యాక్షన్ కమిటీ పేర్కొంది. ఈనెల 30న జరిగే సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రాంతీయ పత్రికలకు మ్యాగజైన్లకు కలర్ యాడ్ ఇచ్చి ఆదుకోవాలని వినతి చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారమే పత్రికలను అప్డేట్ చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటికైనా చిన్న పత్రికలను ఆదరించి మా డిమాండ్లను పరిష్కరించాలని వినతిపత్రంలో కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్న పత్రికల సంఘం నాయకులు యూసుఫ్ బాబు, మాతంగి దాస్, బాలకృష్ణ అశోక్, ఆఫ్రోజ్ ఖురేషి, అహ్మద్ అలీ, గోళ్ళ రమేష్ బాబు, భూపతి రాజు, ఫ్లాష్ ఇండియా శ్రీనివాస్, సోమవరపు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment