దళిత యువకుడు నవీన్ ది ముమ్మాటికి పరువు* *హత్యే -.పాలడగు నాగార్జున*
*దళిత యువకుడు నవీన్ ది ముమ్మాటికి పరువు* *హత్యే*
*ఫాస్ట్రాక్ కోర్టు* *ఏర్పాటు చేయాలి*
*నిష్పక్షపాతమైన విచారణ చేపట్టాలి*
*దోషులను కఠినంగా శిక్షించాలి*
*కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున*
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో దళిత యువకుడైన ఇరిగి నవీన్ ను అతి దారుణంగా కుల దురాహంకారంతో హత్య చేసినారని ఇది ముమ్మాటికి పరువు హత్యేనని *కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున* అన్నారు.
నవీన్ పరువు హత్య విషయమై సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాధితుని తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో కలిసి *నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ క్రిష్ణా రెడ్డిని, జిల్లా ఎస్పీ అపూర్వరావు* వేరువేరుగా కలిసి కేసును పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చూడాలని వినతిపత్రం ఇచ్చి విన్నవించడం జరిగింది. అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *నాగార్జున* మాట్లాడుతూ కేసు లో సత్వరమే విచారణ పూర్తి చేసి ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేందుకు ప్రత్యేక న్యాయమూర్తిని(పాస్ట్రాక్ కోర్టు), ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలన్నారు, పరువు హత్యగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.సంబంధిత యువతిని,తల్లిదండ్రులతోపాటు ఎంతటివారున్నా నిస్పక్షపాతంగా విచారించాలని, ఆ కుటుంబానికి నివాస వసతి గృహము,నష్టపరిహారము జీవనోపాధి కల్పించగలరని కోరారు
అమ్మాయి,మృతుడు నవీన్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించికుంటున్నారు.వీరిద్దరు వివాహం చేసుకోవటానికి సిద్దమైనారన్నారు.కాని కులాలు వేరుకావడంతో తేదీ ఏప్రిల్ 9,, 2023 న ఇరిగి నవీన్ ను నిడ్మనూర్ మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన జేరిపో ప్రేమ విషయంలో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని పిలిచి దళితుడనే కారణంతో అమ్మాయి అతనని వివాహం చేసుకుంటే పరువు పోతుందని బావించి తరుపు బంధువులు అత్యంత కిరాతకంగా నవీన్ ను హత్య చేసినారన్నారు.
*కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షులు ఆదిమూలం శంకర్,ఎం.ఆర్.పి.ఎస్ సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్* మాట్లాడుతూ హత్య లో పాల్గొన్న 9 మందిలో రామలింగయ్య అనే వ్యక్తి పై హత్యా నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయనే అనుమానాలు వున్నాయి. నవీన్ అనే వ్యక్తి అమ్మాయి కులం వాడు కాకపోవడం వల్లే దళితుడు కాబట్టే వేటాడి వెంటాడి చంపినారు అన్నారు.నవీన్ హత్య విషయంలో అమ్మాయి తో సహ వారి తల్లిదండ్రుల ను ఎంతటివారున్నా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేసారు.అతనితో మాట్లాడిన కాల్ డేటా తీయాలన్నారు..!చాటింగ్ లు తీయాలన్నారు..!ఎవరు ఎవరికి ఎన్ని సార్లు పోన్ చేసినారు..మొత్తం ఎన్ని గంటలు మాట్లాడుకున్నారు..ఆ చాటింగ్ లో ఏముంది..!ఇద్దరు కలిసి అనేక చోట్ల తిరిగినారు..?అనేక పోటోలు దిగినారు..?
పెళ్లి చేసుకుంధామనుకున్నారు.!
ఈ సమాచారం అంతా రాబట్టి మొత్తం వివరాలను ఆ కేసులో పొందుపర్చాలని పరువు హత్య గా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.
*తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు* మాట్లాడుతూ దళితుడు కాబట్టే ఇంతవరకు ఏ ఒక్క ప్రజా ప్రతినిధి స్పందించలేదన్నారు. అన్ని కోణాల్లో సమగ్రమైన విచారణ జరిపి 60 రోజులలో చార్జీ షీట్ వేసి,90 రోజుల్లో శిక్ష పడేలా కేసును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.విచారణ వేగవంతం చేసి కఠిన శిక్షలు త్వరితగతిని పూర్తి చేయడానికి ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు కు చొరవ చూపాలన్నారు..పరువు హత్యగా కేసును టేకప్ చేసి ఆ కుటుంభానికి 50 లక్షల ఆర్థిక సహాయం,నివాస గృహం,ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో *కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను,మాల మహానాడు రేఖల సైదులు*,
*చింతపల్లి బాలకృష్ణ,మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు బొజ్జ చిన్న,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం,తెలంగాణ దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పోలే రవి, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, గాదె నరసింహ, బోగరి రామకృష్ణ మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు*.
Comments
Post a Comment