జర్నలిస్టు లను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలను మోసం చేయడం ఓ లెక్కా: ఎమ్మెల్యే రఘునందన్ రావు
జర్నలిస్టు లను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలను మోసం చేయడం ఓ లెక్కా: ఎమ్మెల్యే రఘునందన్ రావు
బిఆర్ఎస్ వ్యతిరేక వార్తలు రాయండి మూడు రోజుల్లో కేసీఆర్ జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరిస్తారు.
ఆల్లం బెల్లం అని చెప్పే పెద్ద మనిషి కుర్చీకి పవర్ లేదంటూ జర్నలిస్టులకు న్యాయం చేయనివారు ఎర్ర బుగ్గ కారులో ఎందుకు తిరుగుతున్నారు అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండి పడ్డారు.అన్ని వర్గాలను మోసం చేసినట్లే కెసిఆర్ జర్నలిస్ట్ లను మోసం చేశారన్నారు. ఇదిగో ఇల్లు అదిగో స్థలాలు జర్నలిస్టులో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జర్నలిస్టులు అధైర్య పడవద్దని ఏక తాటిగా ఉంటే ప్రభుత్వమే దిగివచ్చిందన్నారు. ప్రభుత్వం చేపట్టి ఆత్మీయ సమ్మేలాన్ని పత్రికల్లో ప్రచూరించకుంటే పత్రికల విలువ తెలుస్తుంది అన్నారు. మాస్టర్ ప్లాన్ లో రైతులు ఏ విధంగా ఉద్యమంలో చేపెట్టారు అదే స్ఫూర్తిలో జర్నలిస్టులు ఏకతాటిపై వచ్చి స్థలాల కోసం పోరాడాలన్నారు.
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సకల జనులను ఏకం చేసి చైతన్య వంతమైన పోరాట ఉద్యమన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన బాధ్యతగల వ్యక్తలుగా... నిరంతరం ప్రజల ప్రక్షాళన నిలబడుతూ ప్రజా గొంతు కై వీధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రజల్లోకి వెళ్లి సమాజానికి సేవా చేస్తున్నరని టి జె యూ రాష్ట్ర అధ్యక్షుడు కప్పరప్రసాద్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హర్ష గురుకులం ఎదుట ఏర్పాటు చేసిన ఇండ్ల స్థలాల కొరకై తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.నేటి సమాజంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయినా నిత్యమేదో ఏదో ఒకచోట జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు.జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ములో స్వేచ్ఛ లేకుండా పోయిందనీ, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కరువైందనీ,వీధి నిర్వహణలో ఎంతో మంది జర్నలిస్టులు అవమానాల పాలవుతున్నారన్నారు. కోవిడ్ లో సైతం చాలా మంది జర్నలిస్టులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందనీ నిజాలు కరువవుతున్న ఉన్న నేటి రోజుల్లో ఎంతో మంది జర్నలిస్టులు సమాజానికి సామాజిక సేవ చేస్తూనే ఉన్నారన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రశ్నించే జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందనీ,అనేకమంది అమరవీరుల త్యాగాల ఫలితం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం. జర్నలిస్టుల స్థలాల కోసం.. జర్నలిస్టుల సహాయ నిధి... అక్రడేషన్ ల కోసం జర్నలిస్టులు రోడ్డు ఎక్కే పరిస్థితి నెలకొందన్నారు.కెసిఆర్ అన్ని వర్గాలను మోసం చేసినట్లే జర్నలిస్టులను సైతం మోసం చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి రాష్ట్ర కార్యదర్శి కనక రెడ్డి రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపూరావు,సభాధ్యక్షులు వడ్డ రాజేందర్,, రాష్ట్ర స్థాయి కార్యదర్శి కనక రెడ్డి రాష్ట్ర కార్యదర్శి, చెన్నం గారి మహేష్ గౌడ్, ఉమ్మడి జిల్లా నిజాంబాద్ అధ్యక్షులు, శ్రీనివాస్, మేడ్చల్ అధ్యక్షులు ఎల్లయ్య, సంగారెడ్డి అద్యక్షులు అశోక్ మెదక్ అద్యక్షులు రామయ్య నాయకులు సిద్దాల రవి,రాజు, సంతోష్, మాజీద్,కౌసర్, బాబా, సాయిలు,శ్రీనివాస్ చారి,శ్రీకాంత్,శ్రీనివాస్,రాజ్ కుమార్,ప్రసాద్, గోపాల్ పాల్గొన్నారు
Comments
Post a Comment