ఘనంగా ఐవిఎఫ్ తెలంగాణ నూతన కార్యాలయం ప్రారంభం
ఘనంగా ఐవిఎఫ్ తెలంగాణ నూతన కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్, నారాయణ గూడ కుబేర ఎస్టేట్ లో నూతనంగా నిర్మించిన IVF- తెలంగాణ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం మరియు ఐవీఎఫ్ బెనారస్ ఆనంద నిలయం బ్రోచర్ ఆవిష్కరణ మహోత్సవమునకు ముఖ్య అతిధులుగా ఐవీఎఫ్ చీఫ్ అడ్వయిజర్, మాజీ పార్లమెంట్ సభ్యులు టి.జి.వెంకటేష్, ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ మరియు అతుధులుగా ఐవీఎఫ్ కేంద్ర కమిటీ సీనియర్ కార్యనిర్వాహక అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్త మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ మరియు ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ చీఫ్ అడ్వయిజర్, మాజీ పార్లమెంట్ సభ్యులు టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఊర్లో బడి, గుడి, అన్నదానం, ఎటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అయినా చేయడానికి ఆర్యవైశ్య సోదరులు, మహిళలు ముందుంటారని, సామాజిక సేవా కార్యక్రమం ఏదైనా కావచ్చు తెలంగాణ రాష్ట్రం లో IVF నాయకులు ఆర్యవైశ్యులు ముందు ఉంటారని అన్నారు.ఈ సందర్భంగా.ల ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ 33 జిల్లాల్లో IVF బలోపేతం చేసేందుకు యువత,మహిళలు,IVFనాయకులు సన్నద్ధం కావాలని అన్నారు. ఇప్పటికే IVF ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఇంకా బాగా ఆర్యవైశ్యులు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని, ఇకముందు కూడా అలాగే ఉండాలని అన్నారు. 33 జిల్లాల్లో IVF బలోపేతం చేసేందుకు యువత సన్నద్ధం కావాలని, ఆర్యవైశ్యులు కృషి చేయాలని అన్నారు. ఇప్పటికే IVF ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రిలిమినరీ పాస్ అయి, IAS చదువుతున్న 25 మంది కి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు. సేవా కార్యక్రమాలకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రం పరిధిలోని 33 జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, అన్ని ప్రాంతాలలో, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పేద ఆర్యవైశ్యులకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్,IVF తెలంగాణ మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, IVF తెలంగాణ మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, IVF తెలంగాణ స్టేట్ ఉపాధ్యాక్షుడు సంతోష్ కుమార్, IVF తెలంగాణ యూత్ అధ్యక్షుడు కట్ట రవికుమార్ ,IVF అడ్వైసర్ ముస్త్యాల సత్తయ్య, గౌరిశెట్టి చంద్రయ్య, కె. మల్లికార్జున్, గెల్లి రమేష్, ,ప్రభాకర్, కక్కిరాల రమేష్, పురుషోత్తమ్, IVF స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ గుప్త, IVF-ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు మరియు ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment