కన్నీరు చుక్క కారిస్తే కాదు.. చెమట ముక్క చిందిస్తే.. చరిత్ర రాయగలవని తెలుసుకో...
శ్రీ సాహిత్య చార్య మహాకవి,అభ్యుదయ సాహిత్యానికి యుగకర్త శ్రీ శ్రీ జయంతి సందర్భంగా :-
====
ఆ సృష్టి లో చలనం ఉన్నది ఏదీ ఆగి పోకూడదు
పారే నది... విచే గాలి.. ఊగే చెట్టు
ఉదయించే సూర్యుడు
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా
ప్రవహిస్తున్నది ఆ నెత్తురుతో సహా
ఏదీ ఆగిపోకుడదు....
పుట్టడం గొప్పకాదు. బతకడం గొప్ప
మంచి బతకడం గొప్పగాదు..
మంచిని పంచి బతకడం గొప్ప
నీకు నువ్వే గొప్ప అనుకోకు
నీగురించి నలుగురు..
గొప్పగా చెప్పుకుంటే గొప్ప..
కుదిరితే పరుగెత్తు...
లేకపోతే నడు
అది చేత కాకా పోతే పాకుతూ పో..
అంతే కానీ...
ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు..
ఏదీ తనంతట తాను నీదరి చేరదు
ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే
విజయం నీ సొంతమవుతుంది.
చదివితే ఇవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రా లుగా తెలుగు సాహిత్యంలో తన కలంతో కథంతొక్కి సిరా చుక్కలతో అగ్రి జ్వాలలు కురిపించిన మహాకవి శ్రేణీ
20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించి, ఈ శతాబ్దం నాది అని చెప్పుకున్న దమ్మున్న కవి శ్రీ శ్రీ.
అభ్యుదయ కవి , విష్ణవ కవిగా సాంప్రదాయ చందో బద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన ప్రజాకవి శ్రీ శ్రీ.శ్రీ శ్రీ అసలుపేరు శ్రీరంగం శ్రీనివాసరావు.
ఆయన హేతువాది, నాస్తికుడు.
జీవిత గమనం : - శ్రీ.శ్రీ 1910 ఏప్రిల్ 30న కలిసే విశాఖపట్నంలో పూజిపెద్ది వెంకటరమణయ్య అప్పులకొండ దంపతులకు జన్మించారు. శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతని ఇంటిపేర శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాబ్యాసం విశాఖపట్నండి చేశారు.
1925లో ఎన్.ఎస్.ఎల్సి పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మ తో వివాహం - జరిగింది.
1931లో రామదాసు విశ్వవిద్యాలయంలో ఏజీఎ (జంతులనం) పూర్తి చేశాడు.
1935లో విశాఖలోని మిసెస్ ఎ.వి.ఎస్.డైమస్ప్రేటర్ గా చేరి వివిధ ఉద్యోగాలు చేస్తు వివిధ రచనలు చేశారు.
సాహితీ వ్యాసంగం :-శ్రీ.శ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ వేట ప్రారంభించాడు. తన 18 వంట 1928 లో " (ప్రభవ" అనే కావ్య సంపుటి పుట్టిన ప్రచురించాడు.
1933 - 1940 అతను రాసిన మహాప్రస్థానం. జగన్నాథుని రధ చక్రాలు, గుర్తించు రష్యా, గొప్ప
కవితలను సంకలనం చేశారు.
ఈ కాలాన్ని ఆ మహాయుగంగా చెప్పవచ్చాను.
1934 ఏప్రిల్ 12న మహాప్రస్థానం గొప్ప కవితా
గొప్ప సంకలనాన్ని ప్రారంభించారు. 41 ఖండికలు గల మహాప్రస్థానం. ఆదిశంకరుల భజగోవిందం' నడక వంటిది.
చతురస్ర గతి చందో రీతిలో ఉంటుంది.
మహాప్రస్ధానం తెలుగు సాహిత్యపు దశ దిశను
మార్చిన పుస్తకంగా నేటికి జాననిరా జనాలు అందుకుంటుంది.ఈ రచన శ్రీ.శ్రీ మహాకవి చేసింది.
1947 లో మద్రాసుకు తిరిగి వృచ్చి అక్కడే స్థిరపడ్డాడు.తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేశారు.
1949లో ఒక బాలికను దత్తత తీసుకొన్నాడు. 1956లో సరోజనం రెండవ మూహం చేసుకొని ఆమె ద్వారా ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కలిగాడు.
ప్రాసకు శ్లేషకు శ్రీ శ్రీ పెట్టింది పేరు. శ్రీ శ్రీ మాటల్లో ఒక విధమైన శబ్దలంకారాలు, చమత్కారాలు దొర్లుతుండేవి. అల్పక్షరాల్లో అనల్పార్ధాన్ని శ్రీ శ్రీ
మేటి."వ్యక్తికి -బహువచనం శక్తి అనేది అతను గుర్తించిన మహత్తర వాక్యం.
నువ్వు పడుకున్న పరుపు
నిన్ను చీదరించుకొక ముంందే
బద్ధకాన్ని వదిలేయ్....
నీ అఅద్దం నిన్ను ప్రశ్నించక ముందే
సమాధానం వెతుక్కో...
గెలవక పోవడం ఓటుమి కాదు
మళ్ళీ ప్రయత్నించక పోవడమే..
నిజమైన ఓటమి
కన్నీరు చుక్క కారిస్తే కాదు..
చెమట ముక్క చిందిస్తే..
చరిత్ర రాయగలవని తెలుసుకో...
అంటూ తన రచనలతో యువతను చైతన్య పరుస్తునే తన కలంతో సామాన్య మానవుడి బాధల్ని పాటల్లో వినిపించిన యుగకర్త శ్రీశ్రీ.
నీరంగ ప్రవేశం :-
నేనుసైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను" అంటూ 1956లో ఒక సినిమా రంగం పూర్తిగా రంగప్రవేశం చేశారు.
ఎన్నో.సినిమాలకు ఆయన మాటలను.. పాటలను రాశారు. ఆయన సినీ జీవితం
మొత్తం 1500 పైగా గీతాలు శ్రీశ్రీ కలం నుండి జాలువారాయి.
తెలుగు మొదటి డబ్బింగ్ సినిమా 'ఆహుతి' మాటలు,పాటలను వ్రాశారు. అల్లూరి సీతారామ రాజు సినిమాకు 1974లో అతను రాసిన తెలుగువీర లేవరా ఆ దీక్షబూని సాగరా.. ఆ దేశ మాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయా" తెలుగుపాటుకి, ఇది ఒక ఆణిముత్యం.
తొలిసారి తెలుగు సినిమా చరిత్ర ఈ పాటకు జాతీయస్థాయి పురస్కారం లభించింది. అంతేకాకుండా మనసున మనసై, హలో హలో అమ్మాయి.. నాహృదయంలో నిదురించే చెలి.. పాడవోయి భారతీయుడా, సాహితీ లోకం లో మంచి పేరు తెచ్చిపెట్టిన పాటలు.
::శ్రీ శ్రీ పురస్కారాలు::
*1972లో శ్రీ శ్రీ సాహిత్యనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.
* 1966లో ఖడ్గపుష్పకి సోమియట్ ల్యాండ్ నెహ్ర అవార్డు
* 19740 ఉత్తమ గేయ రచయితగా అవార్డు
* మొదటి రాజ్యాలక్ష్మి ఫౌండేషన్ అవార్డులను శ్రీశ్రీ అ అందుకుకున్నారు
=:: శ్రీ శ్రీ గురించి ప్రముఖుల పలుకులు:::-
*మహాప్రస్థానం ఈ శతబ్దపు తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం --పురిపండా అప్పలస్వామి.
*కృష్ణశాస్త్రి బాధ ప్రపంచపు బాధ.. ఆ ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ --చలం
(మహా ప్రస్థానం -యోగ్యతాపత్రంలో )
*నీది మంచి పద్యమా. ఫ్రెంచి పద్యమా అన్నది
శేషంద్ర గురించి ... శ్రీ శ్రీ
*కవిత్వం ఒక ఆర్కేమీ దాని రహస్యం శ్రీ శ్రీ తెలుసు(పెద్దన కృష్ణశాస్త్రి )తోపాటు అన్నది --బాలగంగాధర్ తిలక్
** అభ్యుదయ కవితొద్యమ మూలవిరాట్టు
-సి. నారాయనణ రెడ్డి
శ్రీ శ్రీ తెలుగుభాష సాహిత్యం గురించి...
తెలుగే మన జాతీయ భాష కావాలనేది శ్రీశ్రీ గారి అభిమతం.
దేశం లో హిందీ భాషదే మొదటిస్థానం అయినా ఆ భాష మాట్లాడేవారు 40శాతం మించరు.
హిందీ ఒక చిన్న చెట్టుకు పరిమితం. రెండభాష అయిన తెలుగు మాట్లాడేవారు సుమారు ఆరు కోట్ల మంది తెలుగువారి మాతృభాష దేశంలో తెలుగువారు అక్ష రాష్ట్రాల్లో వ్యాపించింది అని అన్నారు.
ప్రతి దృష్టిలో తెలుగుభాషా కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ అని అంటారు.
శ్రీశ్రీ అభ్యుదయ రచయిత సంఘం (అరసం) అధ్యక్షులుగా విప్లవ రచయితల సంఘం (1970) స్థాపకులు. కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 13న శ్రీశ్రీ పరమ పదించారు.
======
బి. సరిత
TGT (తెలుగు),
TMRIES-G1
మంచిర్యాల
Ph No : 9494203152
=======
•
Comments
Post a Comment