రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కోరం అశోక్ రెడ్డి


 రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ గా కోరం అశోక్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సం సందర్బంగా రెండవ అంతస్తులోని తన సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కార్యాలయంలో మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని జిల్లా పౌర సంబంధాల అధికారులకు వాహన సౌకర్యం కల్పించేందుకై అనుమతినిమిత్తం ఆర్థిక శాఖకు పంపే తొలి ఫైలు పై సంతకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమాచార, పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ గా, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా, E.O. కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ రెడ్డిని సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, కె.వెంకట రమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్, హష్మీ, సి.ఐ.ఇ రాధాకిషన్, ఆర్.ఐ.ఇ జయరాంమూర్తి, ఎఫ్.డి.సి. ఇ.డి కిషోర్ బాబు తదితరులు అభినందించారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!