ఎయిర్‌పోర్ట్ మెట్రోకు ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌ల ఎంపిక
ఎయిర్‌పోర్ట్ మెట్రోకు ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌ల ఎంపిక
Hyderabad: ఎయిర్‌పోర్ట్ మెట్రోకు జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ గా Systra, RITES, DB ఇంజనీరింగ్ సంస్థల కన్సార్షియంను ఎంపిక చేసినట్లు MD, HAML శ్రీ ఎన్వీయస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కన్సార్షియంలోని మూడు సంస్థలు ప్రజా రవాణారంగంలో ముఖ్యంగా మెట్రో రైళ్ల నిర్వహణలో విశేష అనుభవం గల సంస్థలుగా ప్రఖ్యాతి చెందాయి. Systra సంస్థ - ఫ్రాన్స్, RITES - భారతీయ రైల్వేలు, DB – జర్మనీ దేశాలలకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ దిగ్గజాలుగా ప్రఖ్యాతి. జనరల్ కన్సల్టెంట్ ఎంపిక కోసం మొత్తం ఐదు అంతర్జాతీయ కన్సార్టియాలు పోటీపడ్డాయి. కాగా, Systra నేతృత్వంలోని కన్సార్టియం విజేతగా నిలిచింది. ఈ కన్సార్టియం సాంకేతికంగా అత్యధిక మార్కులు పొందడంతో పాటు, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సేవలను అందించేందుకు గాను రూ. 98.54 కోట్లు కోట్ చేసినట్లు, ఇది పోటీలో పాల్గొన్న ఇతర సంస్థలకన్నా తక్కువ అని ఎండి శ్రీ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్వేలోని పలు విభాగాలలో నిష్ణాతులైన 18 మంది ఇంజనీరింగ్ నిపుణులను అలాగే క్షేత్ర స్థాయిలో మరో 70 మంది సీనియర్ ఇంజనీర్లు, తదితర సిబ్బందిని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణంలో ఈ కన్సార్టియం సమకూర్చుతుంది.
ఈ పోటీలో పాల్గొన్న ఐదు అంతర్జాతీయ కన్సార్టియాల సాంకేతిక సామర్థాన్ని, వారి అనుభవం పరిగణలోకి
తీసుకుని Systra నేతృత్వంలోని కన్సార్టియంను ఎంపికచేయడమైంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ శ్రీ కె. రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ కమిషనర్, HMDA శ్రీ అరవింద్ కుమార్, MD, HAML శ్రీ ఎన్‌విఎస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
ఈ ఇంజనీరింగ్ సలహా సంస్థ వెంటనే తన పనిని ప్రారంభిస్తుందని, ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణానికి అవసరమైన EPC ( Engineering, Procurement and Construction) టెండర్ డాక్యుమెంట్లను త్వరలోనే తయారు చేస్తుందని శ్రీ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు.
Comments
Post a Comment