సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే ఇంత వరకు కొనసాగా- టీఎస్ టీడీసీ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే ఇంత వరకు కొనసాగా-
టీఎస్ టీడీసీ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా
హైదరాబాద్:
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగానని, తోడబుట్టిన సోదరుడిగా యువనేత, మంత్రి కేటీఆర్ తన వెంట నిలిచారని, టూరిజం శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనకు ఎంతగానో సహకరించారని మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తనపట్ల బీఆర్ఎస్ పెద్దలు చూపిన అభిమానం ఎప్పటికీ మరచి పోలేనని, టూరిజం అధికారులు అందించిన సహకారంతో టూరిజం అభివృద్ధికి కృషి చేశానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. టూరిజం శాఖ నూతన చైర్మన్ గా నియమితులైన గెల్లు శ్రీనివాస్ కు ఈ సందర్భంగా ఉప్పల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ఆర్యవైశ్యులకు మేలు జరిగిందని, అన్నివర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోెందని, కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం ఖాయమన్నారు. పాలనాధక్షుడైన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని ఆయన తెలిపారు. 2020 నవంబర్ 13న తనకు టీఎస్ టీడీసీ చైర్మన్ గా అవకాశం కల్పించిన నాటి నుంచి, దాదాపు రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగానని ఆయన తెలిపారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టూరిజం శాఖా మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Post a Comment